యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తాం, ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన, పొరుగు రాష్ట్రం పైనా కన్ను !

2022 లో యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆ రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తాం, ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన, పొరుగు రాష్ట్రం పైనా కన్ను !
Arvind Kejriwal
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 15, 2020 | 3:48 PM

2022 లో యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆ రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఢిల్లీలో తాము అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్లలో తమ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలనన్నింటినీ నెరవేర్చిందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ నగరంలో ఈ 8 ఏళ్లలో మా పార్టీ మూడు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, పంజాబ్ లో ప్రధాన ప్రతిపక్షంగా మారింది. కానీ ఉత్తర ప్రదేశ్ లో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం అని ఆయన వర్చ్యువల్ గా జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

యూపీ నుంచి అనేకమంది ఆరోగ్యం, విద్యతదితర మౌలిక సదుపాయాలకోసం ఢిల్లీకి వస్తుంటారని, అంటే ఇలాంటి సౌకర్యాలు ఆ రాష్ట్రంలో లేకపోబట్టే కదా అని ఆయన అన్నారు. ఇండియాలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ఇప్పటికీ ఎందుకు అభివృధ్ది చెందలేదని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని అరవింద్ కేజ్రీవాల్ దుయ్యబట్టారు. అక్కడి డర్టీ పాలిటిక్స్, అవినీతిపరులైన రాజకీయ నేతలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. స్థానిక ఓటర్లు ప్రతి పార్టీకీ అవకాశం ఇచ్చినప్పటికీ అన్ని పార్టీలూ అవినీతికి పెద్ద పీట వేశాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. యూపీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేస్తుందని ఢిల్లీ సీఎం ప్రకటించడం ఇదే మొదటిసారి.