Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 24 వేల 850 మంది వైరస్​ సోకింది. మరో 613 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు2,44,814. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 4,09,083. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 19,268.
  • ఒడిశాలోని కందమాల్ జిల్లాలో ఎన్‌కౌంటర్. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య కాల్పులు. నలుగురు మావోయిస్టులు మృతి.
  • మరో అద్భుతం సాధించిన డీఆర్డీవో. 1,000 పడకల కోవిడ్ క్రిటికల్ కేర్ ఆస్పత్రి నిర్మాణం పూర్తి. రికార్డు సమయంలో 11 రోజుల్లోనే పూర్తి చేసిన డీఆర్డీవో. 250 పడకల ఐసీయూ-వెంటిలేటర్ వార్డుకు కల్నల్ బి. సంతోష్ బాబు పేరు. క్రిటికల్ కండిషన్ కోవిడ్-19 రోగుల కోసం ఆస్పత్రి ఏర్పాటు. టాటా సన్స్ సహకారంతో పూర్తిగా ఐసీయూ పడకల ఆస్పత్రిని నిర్మించిన డీఆర్డీవో. చత్తర్‌పూర్‌లో నిర్మించిన 10వేల పడకల కోవిడ్ కేర్ సెంటర్లో వేర్వేరు వార్డులకు గల్వాన్ ఘర్షణలో అమరులైన జవాన్ల పేర్లు. మరికాసేపట్లో డీఆర్డీవో క్రిటికల్ కేర్ ఆస్పత్రిని సందర్శించనున్న కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి.
  • వరంగల్: నేడు సంపూర్ణ శాకాంబరీగా దర్శనమిస్తున్న భద్రకాళి అమ్మవారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలు ఆంక్షల మధ్య ఉత్సవాలు. భక్తులు ఎవరూ అమ్మవారికి కూరగాయలు తీసుకురావద్దని విజ్ఞప్తి. నిరాడంబరంగా ఉత్సవాలు.. నేరుగా తోట నుండి కూరగాయలు సేకరించి అమ్మవారిని సంపూర్ణ శాకాంబరీగా అలంకరించిన ఆలయ పూజారులు. సాయంత్రం 8గంటల వరకే దర్శనాలు.
  • చెన్నై : హాస్పిటల్ మూసివేత. చెన్నైలోని విజయా హాస్పిటల్లో కరోనా కలకలం. 50 మందికి పైగా హాస్పిటల్ సిబ్బందికి కరోనా పాజిటివ్. కరోనా తో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ రెడ్డి మృతి. హాస్పిటల్ ఈమెర్జెన్సీ సర్వీసులు నిలిపివేత. హాస్పిటల్లో ఉన్న ఇన్ పేషేంట్ లను ఇతర హాస్పిటల్స్ కు తరలింపు. హాస్పిటల్ లో సిబ్బందికి, వచ్చిన రోగులకు కరోనా టెస్టులు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి తరచూ వైద్యం కోసం విజయ హాస్పిటల్ కు వెళుతున్న వారిలో ఆందోళన.
  • తూ.గోజిల్లా: పిఠాపురం జగ్గయ్య చెరువులో వెలుగుచూసిన మరో ఘరానా మోసం. బ్యాంకు ఆఫ్ బరోడా పి.ఆర్.ఓ నని నమ్మబలికి రూ.1000 తో అకౌంట్ ఓపెన్ చేస్తే బ్యాంకు నుండి రూ.50000 రుణం ఇప్పిస్తానని నమ్మించిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి . జగ్గయ్య చెరువు ప్రాంతంలో 100 మంది వద్ద రూ.1000చొప్పున వసూలు చేసి, ఒక అప్లికేషన్ ఫారం కూడా పూర్తిచేసి నమ్మించిన ఉడాయించిన వ్యక్తి.

కేజ్రీ హ్యాట్రిక్ ? ఆప్ లీడింగ్.. ఢిల్లీ ఎన్నికల్లో వాడుతున్న ‘కమలం’

aap takes big lead in delhi elections, కేజ్రీ హ్యాట్రిక్ ? ఆప్ లీడింగ్.. ఢిల్లీ ఎన్నికల్లో వాడుతున్న ‘కమలం’

ఢిల్లీ ఎన్నికల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ దూసుకుపోతోంది. మంగళవారం ఓట్ల లెక్కింపు జరుగుతున్న కొద్దీ తొలి నుంచీ ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి. ఉదయం 11 గంటల సమయానికి ఈ పార్టీ 50 సీట్లలో లీడింగ్ లో ఉండగా.. బీజేపీ 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఊసే లేదు. కేజ్రీవాల్ తన సమీప ప్రత్యర్థిపై 7,820 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అన్నట్టు కౌంటింగ్ సాగుతోంది. ఆప్ మూడోసారి ఢిల్లీలో అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజాన్ చౌదరి వ్యాఖ్యానించారు. ప్రతివారికీ ఈ విషయం తెలుసునన్నారు. తమ పార్టీ ఓటమి కన్నా బీజేపీపై ఆప్ విజయమే తమకు ముఖ్యమన్నట్టు ఆయన మాట్లాడారు. కాగా.. సీఏఏకి వ్యతిరేకంగా షాహీన్ బాగ్ వద్ద ఆందోళన చేస్తున్న నిరసనకారులు ఆప్ విజయం తమ విజయమే అని పొంగిపోతున్నారు. తమ పట్ల బీజేపీ మంత్రులు, ఆ పార్టీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యల ఫలితమే కమలం  పార్టీ ఓటమికి దారి తీస్తున్నాయని వారు పేర్కొంటున్నారు.

 

 

Related Tags