Breaking News
  • కరోనా నుంచి బయటపడిన చైనా, ఇప్పుడు యూరప్‌ దేశాలకు కిట్లను, మాస్క్‌లను పంపిస్తోంది. అయితే వాటిలో నాణ్యత లేదని కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. పరికరాలను తిప్పి పంపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని, చైనా తన ప్రభావాన్ని విస్తరించుకోవడానికి వాడుకుంటోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భూతం విస్తరిస్తోంది. ఏపీలో ఉన్న 13 జిల్లాలలో 11 జిల్లాలను కరోనా కమ్మేసింది. నిజాముద్దీన్‌ జమాత్‌ లింకులతో చిన్న పట్టణాలు, పల్లెలకు కూడా వ్యాపించింది కరోనా.. కొత్త కేసులన్నింటికీ ఢిల్లీ లింకులుండటం ఆందోళన కలిగిస్తోంది.
  • కరోనాపై యుద్ధం చేస్తున్న భారత్‌కు ప్రపంచబ్యాంకు భారీ సాయాన్ని అందించింది. భారత్‌తో పాటు కరోనాను ఎదుర్కొంటున్న పలు దేశాలకు ప్రపంచబ్యాంకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. కరోనాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న భారత్‌కు ఒక బిలియన్‌ డాలర్ల భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది ప్రపంచబ్యాంక్‌..
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇది గందరగోళానికి దారి తీస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లారు ఆశావర్కర్లు. సర్వే కోసమని వెళ్లిన ఆశా వర్కర్లను దుర్భాషలాడటమే కాకుండా వారిపై దాడికి ప్రయత్నించారు
  • అమరావతి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ.

Delhi CAA Clashes: ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మృతి వెనుక ఆప్ ?

ఢిల్లీలో జరిగిన అల్లర్లలోఇంటెలిజెన్స్ బ్యూరో  అధికారిఅంకిత్ శర్మ మృతి వెనుక ఆప్ హస్తం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పార్టీకి చెందిన తాహిర్ హుసేన్ అనే మున్సిపల్ కౌన్సిలర్ ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది.
aap leader accused in i and b officer s death, Delhi CAA Clashes: ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మృతి వెనుక ఆప్ ?

Delhi CAA Clashes: ఢిల్లీలో జరిగిన అల్లర్లలోఇంటెలిజెన్స్ బ్యూరో  అధికారిఅంకిత్ శర్మ మృతి వెనుక ఆప్ హస్తం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పార్టీకి చెందిన తాహిర్ హుసేన్ అనే మున్సిపల్ కౌన్సిలర్ ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. అల్లర్లు పెద్దఎత్తున జరిగిన నార్త్ ఈస్ట్ ఢిల్లీలో అంకిత్ శర్మ మృతదేహాన్ని ఓ కాలువలో కనుగొన్న సంగతి తెలిసిందే. ఆయనను ఓ గుంపు కొట్టి చంపి డెడ్ బాడీని కాలువలో పడవేసినట్టు వఛ్చిన వార్తలు   .సంచలనం రేపాయి. ఆప్ నేత తాహిర్ హుసేన్ సహచరులే తన కుమారుడిని హతమార్చారని   అంకిత్ శర్మ తండ్రి రవీందర్ శర్మ ఆరోపించారు. అటు-హుసేన్ కి చెందిన ఐదంతస్థుల భవనంపై నుంచి హుసేన్ సహచరుల్లో కొందరు రాళ్లు, పెట్రోలు బాంబులు విసిరినట్టు అంకిత్ శర్మ ఇంటిచుట్టుపక్కలవారు తెలిపారు. ఈ ఆరోపణలను నిరూపించేందుకా అన్నట్టు కొన్ని వీడియోలు బయటికి వచ్చాయి. వీటిలో హుసేన్ గా భావిస్తున్న వ్యక్తి ఈ భవనంపైనుంచి కొంతమందితో కలిసి రాళ్లు విసిరినట్టు కనిపించింది. ఆ వ్యక్తి చేతిలో లాఠీ కూడా ఉంది. అయితే తాను అమాయకుడినని, తనపై వఛ్చిన ఆరోపణలు నిరాధారమని తాహిర్ హుసేన్ తన ట్విటర్ ద్వారా పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నారు. బీజేపీ నేత కపిల్ మిశ్రా విద్వేషపూరిత ప్రసంగాలే అల్లర్లను రెచ్ఛగొట్టాయన్నారు. తన ఇంటి వద్ద కూడా ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారని, నిజానికి తాను హిందూ.ముస్లిం ల మధ్య మంచి సాన్నిహిత్యాన్ని కోరే వ్యక్తినని ఆయన అన్నారు. హిందూ-ముస్లిముల సన్నిహిత సంబంధాల కోసం తాను ఎప్పుడూ పాటు పడుతూ ఉంటానని హుసేన్ పేర్కొన్నారు.

 

 

Related Tags