Breaking News
  • 'మా' అసోసియేషన్‌లో ముసలం. నిన్నటి నుంచి తెరుచుకోని ఆఫీస్‌ తలుపులు. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య విభేదాలతో ఆఫీస్‌కు రాని సిబ్బంది. మాట్లాడేందుకు నిరాకరించిన కార్యవర్గ సభ్యులు.
  • బిల్లులపై చర్చ జరగకుండానే ఏపీ మండలి వాయిదా పడే అవకాశం. బిల్లుపై చర్చకు ఒప్పించేందుకు వైసీపీ సభ్యుల ప్రయత్నాలు. అంగీకరించని విపక్ష సభ్యులు. రూల్‌ 71పై చర్చ జరగాలని పట్టుబట్టిన విపక్ష సభ్యులు.
  • హైదరాబాద్‌: ధరమ్‌ కరం రోడ్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం. 10 మంది చిన్నారులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • తిరుమల: రథసప్తమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు-టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి.
  • హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయాలను డబ్బు శాసిస్తోంది. రాజ్యాధికారం సాధిస్తేనే విద్య, ఉద్యోగాలు వస్తాయి-లక్ష్మణ్‌. డబ్బుతో రాజకీయాలు నడపడం అప్రజాస్వామికం. దళితుల హక్కుల కోసం చేసే పోరాటంలో బీజేపీ ముందుంటుంది -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌.

ఈ ఫొటోలో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా..!

Do you recognize this hero, ఈ ఫొటోలో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా..!

సినిమా అంటే ప్రాణం పెట్టే హీరోలు అన్ని ఇండస్ట్రీల్లోనూ చాలా మందే ఉన్నారు. తమ వయసును కూడా దృష్టిలో పెట్టుకోకుండా వారు ప్రయోగాలు చేసేందుకు ముందుంటారు. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఒకరు. ప్రస్తుతం అతడు లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్నారు. 1994లో హాలీవుడ్‌లో భారీ విజయం సాధించిన ఫారెస్ట్ గంప్ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కనుండగా.. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ మూవీలో ఆమిర్ ఖాన్‌కు సంబంధించిన ఓ లుక్ ఆ మధ్యన విడుదల అయినప్పటికీ.. తాజాగా మరో లుక్ లీక్ అయ్యింది. అందులో పొడవాటి జుత్తు, గడ్డంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు ఈ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్. ఈ లుక్‌ను చూసిన ఫ్యాన్స్ వావ్ ఆమిర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా ఈ మూవీలో ఆమిర్ ఖాన్ సరసన కరీనా కపూర్ నటిస్తుండగా.. కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు. అంతేకాదు ఈ చిత్రం ద్వారానే విజయ్ బాలీవుడ్‌కు పరిచయం కాబోతుండటం విశేషం. వీరితో పాటు షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో అతిథి పాత్రలలో మెరవబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్, వియకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే వరుస హిట్లతో దూసుకుపోతున్న ఆమిర్ ఖాన్ కెరీర్‌కు గతేడాది థగ్స్ ఆఫ్ హిందూస్తాన్‌తో బ్రేక్ పడింది. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ తొలిసారి కలిసి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్‌గా మిగిలింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు ఆమిర్. మరోవైపు ఈ మూవీపై బాలీవుడ్‌లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.