‘కోహ్లీ కెప్టెన్సీని వదిలేయడమా’.. ఇదేం లాజిక్.. గంభీర్‌ను ఏకిపడేసిన ఆకాష్ చోప్రా..

ఐపీఎల్ 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరేసరికి మళ్లీ పేలవ ఫామ్‌ను కొనసాగించిన సంగతి తెలిసిందే. దీనితో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని..

'కోహ్లీ కెప్టెన్సీని వదిలేయడమా'.. ఇదేం లాజిక్.. గంభీర్‌ను ఏకిపడేసిన ఆకాష్ చోప్రా..
Follow us

|

Updated on: Nov 14, 2020 | 11:46 AM

Aakash Chopra Comments: ఐపీఎల్ 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరేసరికి మళ్లీ పేలవ ఫామ్‌ను కొనసాగించిన సంగతి తెలిసిందే. దీనితో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని సోషల్ మీడియా వేదికగా పలువురు కామెంట్స్ చేశారు. అందులో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఒకరు. ‘కోహ్లీ RCB కెప్టెన్‌గా తప్పుకోవాలని.. రోహిత్ శర్మకు భారత వన్డేలు, టీ20ల బాధ్యతను అప్పగించాలని’ వ్యాఖ్యానించాడు.

కొంతమంది మాజీలు గంభీర్ వ్యాఖ్యలను సమర్ధిస్తే.. మరికొందరు కోహ్లీకి మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా.. తాజాగా విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. ”రోహిత్ శర్మకు ముంబై బదులు బెంగళూరు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగిస్తే.. ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిపించేవాడా.? రోహిత్ ఓ గొప్ప కెప్టెన్.. దానిని నేను కూడా ఒప్పుకుంటా. కానీ ముంబై ఇండియన్స్ గెలుపును ఇండియాతో ముడిపెట్టడం సరికాదు.? జట్టు సరిగ్గా ఆడకపోతే కోహ్లీ తప్పేలా అవుతుంది.?  అంటూ ఆకాష్ చోప్రా గంభీర్‌ను సూటిగా ప్రశ్నించాడు.

Also Read:

డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌.? వైరల్ అవుతున్న ట్వీట్.. వివరణ ఇచ్చిన కేంద్రం..

తెలంగాణలో బాణసంచాపై బ్యాన్ విధించిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ.. అమ్మకాలు చేస్తే చర్యలు..

సీఎస్‌కే ఫ్యాన్స్‌కు షాక్.. ఐపీఎల్ 2021లో కొత్త జట్టుకు కెప్టెన్‌గా సురేష్ రైనా.!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లలకు మరో బాధ్యత..

సాయం కోరిన సోనూసూద్.. స్పందించిన నెటిజన్లు.. థ్యాంక్యూ చెప్పిన రియల్ హీరో..