అందరికీ ఆధార్ లేనట్టే..?

అందరికీ ఆధార్, అన్నింటికీ ఆధార్.. నినాదంలోనే తప్ప ఆచరణలో ఇది అమలు కావట్లేదు.. ఆధార్ ను ప్రవేశపెట్టి 10 సంవత్సరాలు గడుస్తున్నా ఇది అందరికీ చేరలేదని మరోసారి రుజువయింది. దేశంలో ఉన్న ఎంతోమంది నిరాశ్రయులు, ట్రాన్స్ జెండర్లకు ఇంకా ఆధార్ అందనేలేదంటూ తాజా నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటికీ 1.2 బిలియన్లకు పైగా ఆధార్ ఐడిలు జారీ చేయబడ్డాయి. దీంతో మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థగా మారింది.. స్కూళ్లలో నమోదు […]

అందరికీ ఆధార్ లేనట్టే..?
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 27, 2019 | 8:15 PM

అందరికీ ఆధార్, అన్నింటికీ ఆధార్.. నినాదంలోనే తప్ప ఆచరణలో ఇది అమలు కావట్లేదు.. ఆధార్ ను ప్రవేశపెట్టి 10 సంవత్సరాలు గడుస్తున్నా ఇది అందరికీ చేరలేదని మరోసారి రుజువయింది. దేశంలో ఉన్న ఎంతోమంది నిరాశ్రయులు, ట్రాన్స్ జెండర్లకు ఇంకా ఆధార్ అందనేలేదంటూ తాజా నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటికీ 1.2 బిలియన్లకు పైగా ఆధార్ ఐడిలు జారీ చేయబడ్డాయి. దీంతో మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థగా మారింది.. స్కూళ్లలో నమోదు దగ్గరనుంచి పన్ను చెల్లింపుల దాకా ప్రతి విషయంలోనూ ఈ 12 అంకెల ఆధార్ సంఖ్యను జతచేయాల్సి ఉంటుంది.

అయితే ఇప్పటికీ మన దేశంలో 102 మిలియన్ మందికి ఆధార్ లేనట్టుగా కన్సల్టింగ్ సంస్థ డాల్బర్గ్ ప్రచురించిన ఒక నివేదిక తెలిపింది. అట్టడుగు జనాభాకు ఆధార్ వచ్చే అవకాశం తక్కువ ఉండటమే కాదు.. వారి ఆధార్ సమాచారంలో లోపాలు కూడా చాలానే ఉన్నాయంటూ ఈ నివేదిక తెలిపింది. ఎలాంటి అడ్రెస్ ఫ్రూఫ్ లేని నిరాశ్రయులు., తమ ఐడెంటిటీని బయటకి చెప్పుకోవడం ఇష్టం లేని ట్రాన్స్ జెండర్లకు ఆధార్ అందడం లేదని ఈ నివేదక సారాంశం..ఇప్పటికైనా లోపాలను సరిచూసుకొని అందరికీ ఆధార్ వచ్చేట్టు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు