Rashmika Mandanna: ఆయన మెచ్చారు.. రష్మిక ఫుల్ హ్యాపీ..!

వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక ఇప్పుడు ఫుల్ హ్యాపీలో ఉందట. ఎందుకంటే తన టెస్ట్‌ కట్‌తో దర్శకుడు సంతృప్తి పొందారట. తాను రాసుకున్న పాత్రకు కరెక్ట్‌గా సరిపోతావని కితాబిచ్చారట. దీంతో ఈ హీరోయిన్ ఇప్పుడు తెగ సంబరపడిపోతుందట.

Follow us

| Edited By:

Updated on: Mar 03, 2020 | 10:35 AM

వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక ఇప్పుడు ఫుల్ హ్యాపీలో ఉందట. ఎందుకంటే తన టెస్ట్‌ కట్‌తో దర్శకుడు సంతృప్తి పొందారట. తాను రాసుకున్న పాత్రకు కరెక్ట్‌గా సరిపోతావని కితాబిచ్చారట. దీంతో ఈ హీరోయిన్ ఇప్పుడు తెగ సంబరపడిపోతుందట.

అసలు విషయంలోకి వెళ్తే.. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికను ఎప్పుడో ప్రకటించారు. ఇక ఇందులో ఆమె పాత్రకు సంబంధించిన టెస్ట్‌ లుక్‌ను తాజాగా చేయించారట సుకుమార్. ఇక ఆమె లుక్‌ను చూసి తృప్తి చెందిన సుకుమార్.. తాను రాసుకున్న పాత్రకు రష్మిక కరెక్ట్‌గా సరిపోతుందని అన్నారట. దీంతో రష్మిక కూడా ఫుల్ హ్యాపీగా ఉందట. ఇక ఇందులో రష్మిక చిత్తూరు జిల్లాకు చెందిన యువతి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. నల్లమల అడవుల్లో ఉండే యువతిగా రష్మిక ఉండబోతుందని.. ఆమె పాత్రకు శేషామణి అనే పేరును పెట్టినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లర్లతో సంబంధం ఉన్న పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుకుమార్-బన్నీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ హ్యాట్రిక్ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న విషయం తెలిసిందే.

Read This Story Also: బన్నీ మూవీపై ఇంట్రస్టింగ్ న్యూస్.. నిజమైతే ఫ్యాన్స్‌కు రచ్చే..!

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!

కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??

ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..

రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..

కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.