ఉద్యోగం పేరుతో మోసం.. యువకుడి ఆత్మహత్య

. ఉద్యోగం ఆశ చూపుతూ వారి నుండి లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఇదే క్రమంలో ఉద్యోగం ఇస్తామంటూ ఒక్కవ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఎన్ని రోజులు అయినా వారి నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన ఆ యువకుడు బలవన్మరణాకి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

ఉద్యోగం పేరుతో మోసం.. యువకుడి ఆత్మహత్య
Follow us

|

Updated on: Aug 04, 2020 | 4:24 PM

ఎంత చదువు చదివిన ఉద్యోగం రాకపోవడంతో నిరుద్యోగులకు నిరాశే మిగులుతోంది. నిరుద్యోగుల నిస్సహాయతను ఆసరాగా మార్చుకొని కొందరు మాయగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగం ఆశ చూపుతూ వారి నుండి లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఇదే క్రమంలో ఉద్యోగం ఇస్తామంటూ ఒక్కవ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఎన్ని రోజులు అయినా వారి నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన ఆ యువకుడు బలవన్మరణాకి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

కర్నూలు జిల్లా గూడూరు మండలం జులకల్‌ గ్రామానికి చెందిన రాఘవేంద్రరెడ్డి (29) ఎంబీఏ పూర్తిచేసి ఉద్యోగ అన్వేషణలో హైదరాబాద్ చేరుకున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసిన జాబ్ దొరకలేదు. ఇదే క్రమంలో అక్కడ నలుగురు వ్యక్తులు ఉద్యోగం ఇప్పిస్తామంటూ మాయమాటలతో నమ్మబలికారు. ఇందుకోసం కొంత సొమ్ముగా చెల్లించాలని సూచించారు. దీంతో రాఘవేంద్రరెడ్డితో పాటు అదే గ్రామానికి చెందిన మరో ముగ్గురి నుంచి దాదాపు రూ.18 లక్షలు వసూలుచేశారు. రోజుల తరబడి ఎదురుచూసిన ఉద్యోగ అనే మాటే లేదు. కాగా, రెండ్రోజుల క్రితం డబ్బులు తిరిగి ఇవ్వమని బాధితులు కోరగా ఇచ్చేది లేదని ఆ నలుగురు స్పష్టం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాఘవేంద్రరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.