Breaking News
  • సామాజిక దూరాన్ని పాటించాలని ఎంత చెబుతున్నా షాపుల దగ్గర మాత్రం ఆ ఆదేశాలను ఎవరూ పాటించడం లేదు. షాపుల దగ్గర సోషల్‌ డిస్టెన్సింగ్‌ కనిపించడం లేదు. ధరల పట్టికలను పెట్టడం లేదు. విజయవాడలాంటి పెద్ద పెద్ద నగరాలలో కూడా ఇదే పరిస్థితి. అసలే విజయవాడలో నాలుగు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అయినా అక్కడ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు జనం.. పక్కపక్కనే నిలబడి సరకులు కొనుక్కుంటున్నారు.
  • ఢిల్లీకి వెళ్లి వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. కాంటాక్టు కేసులు పెరగడంతో ఎవరెవరు ఢిల్లీకి వెళ్లి వచ్చారన్నది ఆరా తీస్తున్నారు అధికారులు. జిల్లాల వారిగా ప్రత్యేక బృందాలు ఆ పనిలోనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మందిని గుర్తించారు. వారందరిని క్వారంటైన్‌కు తరలించారు.
  • విజయవాడలోనే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు రావడంతో మరింత అప్రమత్తమయ్యారు కృష్ణా జిల్లా అధికారులు. సిటీలో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఇక విజయవాడ నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో బంద్‌ పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు.
  • ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఎంత చితక బాదినా.. ఒళ్లు హూనం చేసినా.. వాళ్లు మాత్రం మారడం లేదు. మరికొందరికి ముప్పు కొని తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. బరి తెగించిన బద్మాష్‌గాళ్లు పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు. ఏ పాపం ఎరుగని అమాయకులకి.. కరోనా మాయ రోగాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
  • కరోనా తోచనిపోయిన మృతదేహాలను మతంతో సంబంధం లేకుండా దహనం చేయాలి. ఖననం(పూడ్చి పెట్టడం) అనుమతించబడదు. అంత్యక్రియలకు 5 మందికి మించి ఉండకూడదు. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ పర్దేషి.

సెల్ఫీ మోజు

, సెల్ఫీ మోజు

ఆరిజోనాలోని ఫీనిక్స్ జూలో ఓ మహిళా జాగ్వర్‌తో సెల్ఫీ దిగాలనుకుంది. ఈ సందర్బంగా జాగ్వర్‌ను ఉంచే కంచె దూకి లోపలికి వెళ్లింది. అనంతరం జాగ్వర్‌తో సెల్ఫీ తీసుకోడానికి ప్రయత్నిస్తుండగా.. అది ఆమెపైకి దూకింది. దీంతో ఆమె రక్షించండి అంటూ కేకలు పెట్టింది. ఎన్‌క్లోజర్‌లో అటూ ఇటు పరుగులు పెట్టింది. చివరికి అందులో నుంచి బయటపడింది.

జాగ్వర్ దాడిలో ఆమె భుజానికి బలమైన గాయమైంది. ఈ సమాచారం అందగానే జూ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వైద్యులు తెలిపారు. అయితే, ఆమె ఎన్‌క్లోజర్‌లోకి ఎలా ప్రవేశించిందో తెలుసుకునేందుకు జూలోని సీసీటీవీ కెమేరా ఫూటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

Related Tags