కేకు తినే పోటీలో పాల్గొన్న మహిళ మృతి..

పని చెయ్యడంలో పోటీ ఉండాలి. అది కూడా హెల్దీ వాతావరణంలో సాగాలి. అంతేకానీ బెట్టింగ్‌లు కట్టో, గిప్టులు కొట్టడానికో పోటీలలో పాల్గొంటే ఫలితాలు విషాదాంతాలే అవుతాయి. ఇప్పుడు అలానే కేక్ తినే పోటీలో పాల్గొన్న ఓ మహిళ దురదృష్టవశాత్తూ ప్రాణాలు కొల్పోయింది. ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌లో..’ఆస్ట్రేలియా డే’ నేపథ్యంలో హెర్వే బే అనే హోటల్ యాజమాన్యం  ‘బింజ్ ఈటింగ్’ అనే పోటీని నిర్వహించింది. ఈ కాంపిటీషన్ రూల్స్ ప్రకారం 10 నిమిషాల్లో ఎవరు ఎక్కువ లామింగ్టన్‌ కేకులు తింటే […]

కేకు తినే పోటీలో పాల్గొన్న మహిళ మృతి..
Follow us

| Edited By: Srinu

Updated on: Jan 28, 2020 | 2:00 PM

పని చెయ్యడంలో పోటీ ఉండాలి. అది కూడా హెల్దీ వాతావరణంలో సాగాలి. అంతేకానీ బెట్టింగ్‌లు కట్టో, గిప్టులు కొట్టడానికో పోటీలలో పాల్గొంటే ఫలితాలు విషాదాంతాలే అవుతాయి. ఇప్పుడు అలానే కేక్ తినే పోటీలో పాల్గొన్న ఓ మహిళ దురదృష్టవశాత్తూ ప్రాణాలు కొల్పోయింది. ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌లో..’ఆస్ట్రేలియా డే’ నేపథ్యంలో హెర్వే బే అనే హోటల్ యాజమాన్యం  ‘బింజ్ ఈటింగ్’ అనే పోటీని నిర్వహించింది. ఈ కాంపిటీషన్ రూల్స్ ప్రకారం 10 నిమిషాల్లో ఎవరు ఎక్కువ లామింగ్టన్‌ కేకులు తింటే వారే విజేత. ఈ పోటీలో పాల్గొన్న 60 ఏళ్ల మహిళ.. ఎక్కువ కేక్స్ తినాలన్న ఎ‌గ్జైట్‌మెంట్‌‌లో గుండెపోటుకు గురై తుదిశ్వాస  విడిచారు.

పోటీ ప్రారంభం కాగానే ఆమె ఎక్కువ మోతాదులో కేకు నొట్లో కుక్కున్నారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. అయితే మృతురాలు పేరును హోటల్ యాజమాన్యం వెల్లడించలేదు. ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. మొదటిసారి యురోపియన్లు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఆ దేశంలో ‘ఆస్ట్రేలియా డే’ పోటీలు నిర్వహిస్తారు. ఆ రోజున ఇటువంటి పోటీలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది.