కరోనా లక్షణాలను పసిగట్టే రిస్ట్‌ వాచ్..!‌

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా లక్షణాలను ముందుగానే పసిగట్టే రిస్ట్‌ వాచ్‌ను తయారు చేశారు వరంగల్‌ నిట్‌, మద్రాస్‌ ఐఐటీకి చెందిన

కరోనా లక్షణాలను పసిగట్టే రిస్ట్‌ వాచ్..!‌
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2020 | 3:28 PM

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా లక్షణాలను ముందుగానే పసిగట్టే రిస్ట్‌ వాచ్‌ను తయారు చేశారు వరంగల్‌ నిట్‌, మద్రాస్‌ ఐఐటీకి చెందిన పూర్వ విద్యార్థులు. వీరంతా కలిసి మ్యూజ్‌ వేరబుల్స్‌ పేరిట గతంలో ఓ స్టార్టప్ ను ప్రారంభించారు. తొలుత హైబ్రిడ్‌ రిస్ట్‌ వాచ్‌లను తయారు చేసిన వీరు.. ప్రస్తుతం వాటిని మరింత ఆధునికీకరించి కరోనా లక్షణాలను ముందస్తుగా గుర్తించేలా తీర్చిదిద్దారు.

ఈ స్మార్ట్ వాచ్‌ను ధరిస్తే శరీర ఉష్ణోగ్రత, గుండె వేగం, రక్తంలో ఆక్సిజన్‌ శాతం వంటి అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. కంటైన్మెంట్‌ ఏరియాలకు వెళ్లినప్పుడు ఈ వాచ్‌ అప్రమత్తం చేస్తుంది. ఆరోగ్య సేతు యాప్‌తోనూ దీన్ని అనుసంధానం చేసుకోవచ్చు. వచ్చే నెల మార్కెట్‌లోకి విడుదల చేయాలని భావిస్తున్నారు. దీని ధర రూ.3500-4,000 వరకూ ఉండే అవకాశం ఉందని, మ్యూజ్‌ వేరబుల్స్‌ సంస్థ సహ వ్యవస్థాపకురాలు తెలిపారు.

Read More:

నర్సులకు భారీ ఆఫర్లు.. విమానచార్జీలు.. 50 వేల జీతం..!

ఇంటర్ సెకండియర్‌ విద్యార్థులందరూ పాస్‌.. అందుబాటులో మెమోలు..!