ఎన్టీఆర్ బయోపిక్‌పై మరోసారి వివాదం

తన ఐడియాస్‌నే కాపీ చేసి సినిమా తీశారంటూ దర్శకుడు దేవ కట్టా ట్విట్టర్‌లో ఆరోపించడం సంచలనమైంది. ఆ సినిమా తీయకముందు నిర్మాత విష్ణు ఇందూరి తనను కలిశాడని.. ఆ టైమ్‌లో ఎన్టీఆర్ కు సంబంధించిన కొన్ని...

ఎన్టీఆర్ బయోపిక్‌పై మరోసారి వివాదం
Follow us

|

Updated on: Aug 13, 2020 | 12:33 PM

ఎన్టీఆర్ బయోపిక్..మరోసారి వివాదమవుతోంది. కథనానాయకుడు, మహానాయకుడు సినిమాల్లోని స్టోరీ ఐడియా తనదేనంటూ డైరెక్టర్ దేవ కట్టా ఆరోపిస్తుండడం…టాలీవుడ్‌లో హాట్‌టాపిక్ అయింది. కథనాయకుడు, మహానాయకుడు విడుదలై ఏడాది దాటిపోయింది. బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించి నటించిన చిత్రాలు. బాక్సాఫీసు లెక్కలెలా ఉన్నా… బాలయ్య ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన సినిమాలీ రెండు. అయితే నిర్మాణంలోనూ.. సినిమా విడుదలైనప్పుడు లేని వివాదం ఇప్పుడు మొదలైంది.

తన ఐడియాస్‌నే కాపీ చేసి సినిమా తీశారంటూ దర్శకుడు దేవ కట్టా ట్విట్టర్‌లో ఆరోపించడం సంచలనమైంది. ఆ సినిమా తీయకముందు నిర్మాత విష్ణు ఇందూరి తనను కలిశాడని.. ఆ టైమ్‌లో ఎన్టీఆర్ కు సంబంధించిన కొన్ని విషయాలు పంచుకున్నానని.. అవే అంశాలతో ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు తీశారన్నది దేవకట్టా వాదన. అయితే దేవ కట్టా తనకెలాంటి స్టోరీ చెప్పలేదని… తానే ఎన్టీఆర్‌ కు సంబంధించిన స్టోరీ లైన్ దేవ కట్టాకు చెప్పానని విష్ణు ఇందూరి టీవీ9తో అన్నారు.

అయితే ఎన్టీఆర్ బయోపిక్ మూవీస్‌ విడుదలైన ఏడాది తర్వాత ఈ వివాదం తెరపైకి ఎందుకు దివంగత నేత వైఎస్ఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య ఉన్న స్నేహాన్ని, రాజకీయ వైరాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఓ ఫిక్షనల్ వెబ్ సిరీస్ చేయబోతున్నట్టు ఫిలింమేకర్ రాజ్ ప్రకటించాడు.  ఈ మొత్తం వ్యవహారంపై దర్శకుడు దేవ కట్టా తీవ్రంగా స్పందించాడు. వైఎఎస్ఆర్, చంద్రబాబుపై ఉన్న అభిమానంతో తను మూడేళ్ల కిందటే ఓ ఫిక్షనల్ కథ రాసుకున్నానని, త్వరలోనే దాన్ని వెబ్ సిరీస్ రూపంలో తీసుకొస్తున్నానని తెలిపిన దేవ కట్టా.. సదరు మేకర్స్ తన స్క్రిప్ట్ ను కాపీ కొట్టకుండా ఉంటే మంచిదని హెచ్చరించాడు.

“వైఎస్ఆర్ కు ఘనంగా నివాళులు అర్పించేలా, చంద్రబాబు పొలిటికల్ లైఫ్ ను గుర్తుచేసేలా.. వాళ్లిద్దరి మధ్య స్నేహం, రాజకీయ వైరంపై ఫిక్షనల్ గా 2017లోనే ఓ స్క్రిప్ట్ రాశాను. కాపీ రైట్ చట్టం కింద దాన్ని రిజిస్టర్ కూడా చేయించాను. అంతేకాదు.. 2017 నుంచి ఈ స్క్రిప్ట్ కు సంబంధించి కొన్ని వెర్షన్లను రిజిస్టర్ చేయిస్తూ వస్తున్నాను. కానీ ఆ ఐడియాను కొంతమంది హైజాక్ చేస్తున్నారు. వాళ్ల క్రియేటివిటీని అక్కడితో ఆపేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నేను రిజిస్టర్ చేయించిన సీన్స్/థీమ్స్ ను కాపీ చేసి నన్ను లీగల్ గా ప్రొసీడ్ అయ్యేలా చేయరనే అనుకుంటున్నాను.”

వైఎస్ఆర్-చంద్రబాబుపై ఆల్రెడీ వెబ్ సిరీస్ ఎనౌన్స్ చేసిన యూనిట్ పై ఈ సందర్భంగా కొన్ని ఘాటైన విమర్శలు కూడా చేశాడు దేవకట్టా.. గతంలో ఈ యూనిట్ కు చెందిన ఓ వ్యక్తి తన నుంచి ఓ స్క్రిప్ట్ దొంగిలించాడని, ఈసారి మాత్రం చూస్తూ ఊరుకోనని హెచ్చరించాడు. గతంలో ఇదే వ్యక్తి నా నుంచి మరో స్క్రిప్ట్ ను దొంగిలించాడు. కానీ డిజాస్టర్ తీశాడు. ఈసారి అలాంటి పనులు చేయకుండా అతడ్ని అడ్డుకుంటాను. వైఎస్ఆర్, చంద్రబాబుపై ఉన్న గౌరవంతో నేను ఈ పని చేస్తాను.

వైఎస్ఆర్, చంద్రబాబు మధ్య ఉన్న ఫ్రెండ్ షిఫ్, రాజకీయ వైరుధ్యాన్ని గాడ్ ఫాదర్ సినిమా యాంగిల్ లో చూశాడట దేవ కట్టా. ఆ సినిమా స్ఫూర్తితో ఈ రాజకీయ నాయకుల జీవితాల్ని 3 భాగాలుగా రాసుకున్నాడట. తర్వాత దాన్ని వెబ్ సిరీస్ ఫార్మాట్ లోకి మార్చాడట. దాన్ని తెరకెక్కించేందుకు ప్రస్తుతం కొన్ని ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నాడు దేవకట్టా. అంతలోనే తన కథతో మరో సిరీస్ వస్తోందని తెలుసుకొని.. ఇలా సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. తన లీగల్ టీమ్ ఈసారి చూస్తూ ఊరుకోదని హెచ్చరించాడు.