Breaking News
  • శ్రీకాకుళం: కచరాంలో తృప్తి రిసార్ట్‌ యాజమాన్యం నిర్వాకం. రోడ్లపై గుర్రపు స్వారీ నిర్వహించిన తృప్తి రిసార్ట్‌ యాజమాన్యం. బైక్‌పై వెళ్తున్న రాంబాబు, రమాదేవి దంపతులను గుద్దిన గుర్రం. ఆస్పత్రిలో రాంబాబు పరిస్థితి విషమం. పట్టించుకోని రిసార్ట్‌ యాజమాన్యం. రాసార్ట్‌ ఎదుట స్థానికుల ఆందోళన, పరిస్థితి ఉద్రిక్తం. భారీగా మోహరించిన పోలీసులు.
  • ప.గో: తణుకు మండలం దువ్వలో పిచ్చికుక్క స్వైర విహారం. పిచ్చికుక్క దాడిలో10 మందికి గాయాలు.
  • గుంటూరు: సత్తెనపల్లిలో మహిళ ఆత్మహత్యాయత్నం. చోరీ కేసు పెట్టారన్న మనస్థాపంతో నిద్రమాత్రలు మింగిన లక్ష్మీ. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • అనంతపురం: కదిరి మండలం నడిమిపల్లిలో దారుణం. యువకుడు సుధాకర్‌ గొంతు కోసిన దుండగులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుధాకర్‌. గతంలో రామాంజనేయులు భార్యను ఎత్తుకెళ్లి.. తిరిగి అప్పగించిన సుధాకర్‌. రామాంజనేయులుపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.
  • అనంతపురం: హిందూపురంలో రెచ్చిపోయిన వీధికుక్కలు. ఇద్దరు చిన్నారులపై దాడి. వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారులు. ఆస్పత్రికి తరలింపు, పరిస్థితి విషమం.
  • విజయవాడ: వంశీ వ్యాఖ్యలపై అయ్యప్ప భక్త కమిటీ అభ్యంతరం. టీవీ9 డిబేట్‌లో వంశీ అనుచిత వ్యాఖ్యలు సరికాదు. అయ్యప్ప మాలలో ఉన్న భక్తులు రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. పరుష పదజాలంతో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. అయ్యప్ప భక్తులకు వంశీ కళంకం తెచ్చారు. ఇప్పటికైనా నియమనిష్టలతో దీక్ష చేయాలి-వేణుగోపాలస్వామి.
  • హైదరాబాద్‌: అశ్వత్థామరెడ్డి నివాసానికి వెళ్లిన ఎంపీ కోమటిరెడ్డి. అశ్వత్థామరెడ్డిని పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అందరూ ముందుకు రావాలి. అశ్వత్థామరెడ్డికి ఏం జరిగినా సీఎం కేసీఆర్‌దే బాధ్యత. కార్మికుల సమస్యలు ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలి. సడక్‌బంద్‌ను విజయవంతం చేయాలి-ఎంపీ కోమటిరెడ్డి.

యురేనియం ప్రాజెక్ట్‌.. ఆ ఊరి వినాశనానికి కారణమైంది!

‘సేవ్ నల్లమల’… స్టాప్ యురేనియం అంటూ సోషల్ మీడియా వేదిక ఉద్యయం నడుస్తున్న సంగతి తెలిసిందే. నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు పోరాటానికి దిగారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఈ అంశంపై పార్లిమెంట్‌లో చర్చించి.. నల్లమలలో ఎటువంటి తవ్వకాలకు తాము అనుమతి ఇవ్వలేదని, ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోమని తెగేసి చెప్పింది. మరోవైపు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో యురేనియం శాంపిల్స్ కోసం చేసిన డ్రిల్లింగ్ పనులను స్థానికులు అడ్డుకోవడం జరిగింది. అటు జనసేనాని కూడా ట్విట్టర్ ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని ఈ విషయంపై ప్రశ్నించారు కూడా. ఇదంతా ఇప్పుడు జరుగుతున్న కథ.. కానీ కడప జిల్లాలోని యురేనియం ప్రాజెక్ట్‌తో జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది. ఆ ప్రాజెక్ట్ వల్ల చుట్టూ ప్రక్కల ఉన్న ఆరు గ్రామాల ప్రజల బ్రతుకులు ఛిద్రం అయ్యాయి. స్లో పాయిజన్‌లా రేడియేషన్ అక్కడి వారిని కబళిస్తోంది. దేశంలో అణు విద్యుత్ వెలుగుల కోసం ఆ గ్రామస్తులు గుండెల మీద అణు కుంపటి మోస్తున్నారు. మౌనంగా హాలాహలాన్ని భరిస్తున్నారు. యురేనియం ప్రాజెక్ట్ చిమ్ముతున్న విషానికి ఆ ఆరు గ్రామాలు తల్లడిల్లిపోతున్నాయి. అసలు ఆ గ్రామాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.