అటవీశాఖ సిబ్బంది పై దాడి కేసులో మరో ట్విస్ట్

అటవీశాఖ సిబ్బంది పై దాడి కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఫారెస్టు అధికారుల దాడి తర్వాత ఎమ్మెల్యే కోనప్ప సార్సాల గ్రామస్తులతో మాట్లాడుతున్న వీడియో బయటకు వచ్చింది. విలేకర్లని పిలిపిస్తా.. ఇలా చెప్పండి.. అలా చెప్పండంటూ ఆయన వారికి వివరించారు. ఈ వీడియో బయటకొచ్చాక ఎమ్మెల్యే ఫోన్ స్విచ్‌ఆఫ్‌లో ఉంది. ఆయన ఎక్కడ ఉన్నారనేది తెలియడం లేదు. ఈ వీడియో బయటికి రాకముందు ఎమ్మెల్యే కోనప్ప తన తమ్ముడు అధికారులపై దాడి చేయలేదని వాదించారు. అటవీశాఖ […]

అటవీశాఖ సిబ్బంది పై దాడి కేసులో మరో ట్విస్ట్
Follow us

| Edited By:

Updated on: Jul 01, 2019 | 12:53 PM

అటవీశాఖ సిబ్బంది పై దాడి కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఫారెస్టు అధికారుల దాడి తర్వాత ఎమ్మెల్యే కోనప్ప సార్సాల గ్రామస్తులతో మాట్లాడుతున్న వీడియో బయటకు వచ్చింది. విలేకర్లని పిలిపిస్తా.. ఇలా చెప్పండి.. అలా చెప్పండంటూ ఆయన వారికి వివరించారు. ఈ వీడియో బయటకొచ్చాక ఎమ్మెల్యే ఫోన్ స్విచ్‌ఆఫ్‌లో ఉంది. ఆయన ఎక్కడ ఉన్నారనేది తెలియడం లేదు. ఈ వీడియో బయటికి రాకముందు ఎమ్మెల్యే కోనప్ప తన తమ్ముడు అధికారులపై దాడి చేయలేదని వాదించారు. అటవీశాఖ అధికారుల తప్పిదాల వల్లే ఘర్షణ జరిగిందని, ఈ విషయంలో కావాలనే కృష్ణను బద్నాం చేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో అటవీశాఖ అధికారుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని అధికారులపై మండిపడ్డారు.

ఇక ఈ దాడి ఘటనలో పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. దాడి జరిగిన సమయంలో డీఎస్పీ, సీఐలు నిర్లక్ష్యంగా వ్యవహరించారని భావించి.. వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. కాగజ్‌నగర్ డీఎస్పీ సాంబయ్య, రూరల్ సీఐ వెంకటేష్‌లను సస్పెండ్ చేస్తూ వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక సార్సాల కేసు విచారణ అధికారిగా ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణను నియమించారు. ఈ దాడి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జెడ్పీచైర్మన్ కృష్ణారావును అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ దాడిలో గాయపడిన అటవీ శాఖ అధికారిణి అనిత హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ సార్సాల ఫారెస్ట్ ఏరియాలో ఉద్రిక్తత కొనసాగుతోంది. అధికారులు మళ్లీ మొక్కలు నాటేందుకు అక్కడకు వెళ్లారు. అటవీశాఖ అధికారులపై దాడిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. ఓ వైపు దాడికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకుని.. అటవీ భూముల సంరక్షణ కోసం చర్యలు చేపట్టింది.

ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే