‘ఆచార్య’లో చెర్రీ పాత్రపై కొనసాగుతున్న డైలమా..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న 'ఆచార్య'లో రామ్ చరణ్‌ ఓ కీలక పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే.

'ఆచార్య'లో చెర్రీ పాత్రపై కొనసాగుతున్న డైలమా..!
Follow us

| Edited By:

Updated on: Jun 08, 2020 | 10:05 AM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘ఆచార్య’లో రామ్ చరణ్‌ ఓ కీలక పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని చిరంజీవి కూడా వెల్లడించారు. ఆ పాత్రకు చెర్రీనే కరెక్ట్ సరిపోతాడని తనకు అనిపించిందని, ఈ విషయాన్ని కొరటాల దగ్గర ప్రస్తావిస్తే ఆయన కూడా తన చాయిస్‌కే ఓటు వేశారని చిరు ఓ సందర్బంలో వెల్లడించారు. అయితే ఫిలింనగర్‌ తాజా సమాచారం ప్రకారం చెర్రీ ఈ సినిమాలో నటించడంపై ఇంకా డైలమా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను మళ్లీ సెట్స్‌ పైకి తీసుకెళ్లే ముందే చిరు, చెర్రీలపై టెస్ట్ షూట్ చేయాలని కొరటాల భావిస్తున్నారట. ఇక ఆ షూటింగ్‌లో సంతృప్తి చెందితేనే చెర్రీని ఈ సినిమాలో పెట్టుకోవాలని కొరటాల అనుకుంటున్నారట. ఒకవేళ సరిపోకపోతే మరో స్టార్ హీరోతో ఈ పాత్రను చేయించాలని ఆయన ఆలోచిస్తున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా సామాజిక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి రెండు పాత్రలో నటించబోతున్నారు. నక్సలైట్‌గా, ప్రొఫెసర్‌గా ఆయన కనిపించనున్నారు. చిరు సరసన కాజల్ మరోసారి జత కట్టబోతోంది. సోనూసూద్, అజయ్, హిమజ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

Read This Story Also: తెలంగాణలో నేడు తెరుచుకోనున్న ప్రార్థనా మందిరాలు.. మార్గదర్శకాలివే..!

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.