చోరి చేసిన కార్లు ఢీకొని దొరికిపోయిన దొంగలు

వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు పోలీసులకు కష్టం లేకుండా ఇద్దరు దొంగలు దొరికిపోయారు. అదీ కూడా చోరి చేసిన కార్లతో సహా. ఇంకేముందు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కటకటాల వెనక్కు పంపారు. సినీ పక్కీలో జరిగిన ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

చోరి చేసిన కార్లు ఢీకొని దొరికిపోయిన దొంగలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 09, 2020 | 3:50 PM

వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు పోలీసులకు కష్టం లేకుండా ఇద్దరు దొంగలు దొరికిపోయారు. అదీ కూడా చోరి చేసిన కార్లతో సహా. ఇంకేముందు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కటకటాల వెనక్కు పంపారు. సినీ పక్కీలో జరిగిన ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

అమెరికాలోని న్యూబెర్గ్ నగరంలో జూలై 5న అచ్చం సినిమా సీన్ లాగే ఓ ఘటన జరిగింది. రాండి లీ కూపర్ అనే 27 ఏండ్ల వ్యక్తి టయోటా ల్యాండ్ క్రూయిజర్ కారును చోరీ చేసి పారిపోయాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ కారును గుర్తించి వెంబడించారు. పోలీసుల రాకను పసిగట్టిన రాండీ కారు స్పీడ్ పెంచాడు. కొంత దూరం వెళ్లి మరో కారును ఢీకొట్టాడు రాండీ. అయితే, ఎదురుగా ఢీకొట్టిన కారు కూడా చోరికి గురైనట్లు పోలీసులు నిర్థారించారు.

క్రిస్టిన్ నికోల్ బేగ్ అనే 25 ఏండ్ల యువతి మూడు వారాల క్రితం బ్యూక్ రీగల్ కారును దొంగిలించింది. డ్రగ్స్ మత్తులో కారు వేగంగా నడిపిం రాండీ కారును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. మాదకద్రవ్యాల మత్తులో ఉన్న ఆ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఇద్దరు కారు దొంగల గురించి పోలీసులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా నెటిజన్లు తమ కామెంట్స్ ఛలోక్తులు విసిరారు. సినిమాల్లో జరిగే ఘటనలు యాదృశ్చికంగా జరగడం వింతగా ఉందంటూ సెటైర్లు వేశారు.