చాయ్ పే చర్చా ! మెదడుకదే కావాలప్పా !

Tea is considered to be one of the popular and most consumed beverages globally., చాయ్ పే చర్చా ! మెదడుకదే కావాలప్పా !

టీ లేదా చాయ్..చల్ల చల్లటి వాతావరణంలో వేడివేడి చాయ్‌ తాగితే..ఉంటుంది…అయిన ఆ కిక్కే వేరప్పా. టీని చాలామంది ఎక్కువ ఇష్టంగా తాగుతుంటారు. ఉదయం లేవగానే టీ గొంతులో పడకపోతే ఏ పనీ కాదు. ఇలా టీ తాగడం వల్ల నష్టాలున్నాయని గతంలో చాలా వార్తలు వచ్చాయి. అయితే, వాటిని కొట్టిపారేస్తోంది తాజా పరిశోధన. టీ తాగడం వల్ల మీ మెదడు పనితీరు పెరుగుతుందని తాజా అధ్యయనం చెబుతోంది. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ నేతృత్వంలో యూకే లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవల జరిపిన అధ్యయనం ప్రకారం,..రెగ్యులర్‌‌‌‌గా చాయ్‌‌‌‌ తాగేవాళ్ల బ్రెయిన్‌‌‌‌, తాగని వాళ్ల కన్నా షార్ప్‌‌‌‌గా పని చేస్తుందని నేషనల్‌‌‌‌ యూనివర్సిటీ ఆఫ్‌‌‌‌ సైంటిస్టులు చెప్పారు. 60, అంతకంటే ఎక్కువ వయసున్న 36 మందిని సుమారు మూడేళ్ల పాటు పరీక్షించి ఈ విషయం కనుగొన్నారు. మొదట ఈ 36 మందికి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేశారు. వాళ్ల బాడీ, మెదడు ఎలా పని చేస్తుందో తెలుసుకున్నారు. తర్వాత వాళ్లను గమనిస్తూ వచ్చారు. కనీసం నాలుగు సార్లు గ్రీన్‌‌‌‌ టీ గాని, ఊలుంగ్‌‌‌‌ టీ గాని, బ్లాక్‌‌‌‌ టీ గాని తాగిన వాళ్ల
బ్రెయిన్‌‌‌‌, తాగని వాళ్ల కన్నా చాలా షార్ప్‌‌‌‌గా పని చేస్తుందని తెలుసుకున్నారు. వాళ్లకు జ్ఞాపకశక్తి కూడా బాగుంటుందని కనుగొన్నారు. గతంలోనూ చాయ్‌‌‌‌పై చాలానే సర్వేలొచ్చాయి. చాయ్‌‌‌‌ తాగే వాళ్లకు మూడ్‌‌‌‌ బాగుంటుందని, గుండె రోగాలు దరి చేరవని సర్వేలు చెప్పాయి. కాబట్టి, క్రమం తప్పకుండా ఛాయ్‌ తాగేవారు ఇకపై ప్రతీ సిప్‌ను ఆస్వాదించవచ్చంటున్నారు పరిశోధకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *