పీక్స్‌కి చేరిన పిచ్చి.. టిక్‌టాక్ కోసం అడవిలోకి వెళ్లి.. దారిమరచి..!

A Student who immersed in TikTok forgot route in Seshachalam Forest, పీక్స్‌కి చేరిన పిచ్చి.. టిక్‌టాక్ కోసం అడవిలోకి వెళ్లి.. దారిమరచి..!

ఇప్పటికే టిక్‌టాక్ చేయడం వల్ల పలువురి ఉద్యోగాలు, ప్రాణాలు పోతున్నాయి. అయినా కానీ.. ఈ టిక్ టాక్ పిచ్చి మాత్రం పోవడం లేదు. దీని కోసం ప్రాణాలను సైతం లెక్కచెయ్యట్లేదు యువత. ఆస్పత్రి స్టాఫ్, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇలా చాలా మంది ఈ టిక్‌టాక్‌కు దాసోహం అయిపోయారు. ఇక తాజాగా.. టిక్‌టాక్ చేయడం కోసం అడవికి వెళ్లాడు ఓ విద్యార్థి.

చిత్తూరు జిల్లాకు చెందిన మురళి అనే స్టూడెంట్ క్రేజ్‌ కోసం టిక్‌టాక్ చేయడానికి శేషాచల అడవిలోకి వెళ్లాడు. దానిలో పూర్తిగా లీనమై.. తాను వచ్చిన దారి మర్చిపోయాడు. దీంతో. రాత్రి అయ్యింది.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో వాట్సాప్‌లో తన స్నేహితులకు వివరం చెప్పాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈలోపు.. అసలే అడవి.. క్రూరమృగాలు తిరిగే చోటు.. దీంతో.. భయపడ్డ మురళీకి.. ఫిట్స్ వచ్చాయి. పరిస్థితి విషమించేలోగానే.. వాట్సాప్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు.. మురళి జాడ తెలుసుకుని కాపాడారు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా.. యువత మాత్రం మేలుకోవడంలేదు. క్రేజ్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *