AF AP అంటే.? ఇంటర్ బోర్డు నిర్వాకంపై టీవీ9 ప్రత్యేక కథనం

ఇంటర్ ఫలితాలను చూసిన తర్వాత ప్రతీ విద్యార్థిని నాలుగు అక్షరాలు వేధిస్తున్నాయి. అవే ‘AFAP’. ఇక ఇందులో ‘AF’ అంటే ఆబ్సెంట్ ఫెయిల్ అని ఏ ఇంటర్ స్టూడెంట్ అయినా చెప్పగలడు. కానీ AP అంటే ఏమిటని అటు విద్యార్థులు ఇటు అధికారులు సైతం బుర్రలు గోక్కుంటున్నారు. ఎవరికి తోచిన వాదన వారు చేస్తున్నారు. కొంతమంది అధికారులు ఏకంగా ఆబ్సెంట్ పాస్ అనే దానికి వివరణ ఇచ్చారు. వినడానికి ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. అసలు ఆబ్సెంట్ […]

AF AP అంటే.? ఇంటర్ బోర్డు నిర్వాకంపై టీవీ9 ప్రత్యేక కథనం
Follow us

|

Updated on: Apr 25, 2019 | 12:49 PM

ఇంటర్ ఫలితాలను చూసిన తర్వాత ప్రతీ విద్యార్థిని నాలుగు అక్షరాలు వేధిస్తున్నాయి. అవే ‘AFAP’. ఇక ఇందులో ‘AF’ అంటే ఆబ్సెంట్ ఫెయిల్ అని ఏ ఇంటర్ స్టూడెంట్ అయినా చెప్పగలడు. కానీ AP అంటే ఏమిటని అటు విద్యార్థులు ఇటు అధికారులు సైతం బుర్రలు గోక్కుంటున్నారు. ఎవరికి తోచిన వాదన వారు చేస్తున్నారు. కొంతమంది అధికారులు ఏకంగా ఆబ్సెంట్ పాస్ అనే దానికి వివరణ ఇచ్చారు. వినడానికి ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. అసలు ఆబ్సెంట్ అయిన విద్యార్థి ఎలా పాస్ అవుతాడని మీరు అనుకోవచ్చు. సరిగ్గా ఇలాంటి సందేహమే టీవీ9 కు కూడా వచ్చింది. సుమారు ముప్పై వేల మంది పరీక్షకు హాజరు కాకుండా ఎలా పాస్ అయ్యారన్నది విద్యార్థులు, విద్యావేత్తలకు అర్ధం కాని ప్రశ్నగా మారింది.

నాలుగు రోజుల క్రితం విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఇలా AP అంటూ ప్రింట్ అయి వచ్చిన మెమోలను చూసి విద్యార్థులందరూ కంగారు పడ్డారు. పరీక్షకు హాజరు కాకుండా ఫెయిల్ అయితే AF అని వస్తుంది.. కానీ హాజరు కాకుండా పాస్ అవడం ఉంటుందా అని విద్యార్థుల ప్రశ్న. ఇది ఇలా ఉంటే AP కి వివరణ ఇదే అంటూ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ చెప్పిన సంజాయిషీ విని అందరూ షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు నిర్వాకం పై టీవీ 9 సీఈఓ రవి ప్రకాష్ గారి విశ్లేషణ..