ఓ కసాయి కొడుకు రాక్షతత్వం

నవమాసాలు మోసి.. కనిపెంచిన తల్లిని నిర్దాక్షణ్యంగా వదిలి వెళ్లిపోయాడు. అనారోగ్యంతో ఉన్న అమ్మను హాస్పిటల్లో చేర్పిస్తానని తీసుకొచ్చి.. ఆస్పత్రి ఆవరణలో వదిలేసి వెళ్లిపోయాడు. మహాబూబాద్ లో జరిగిన ఈ ఘటన అందరిచేత కంటతడి పెట్టించింది. విజయవాడకు చెందిన తాటి రాములమ్మకు ముగ్గురు కొడుకులు, ఓ కూతురు. ఇద్దరు కొడుకులు చనిపోవడంతో మిగిలిన కుమారుడు పాపయ్య దగ్గర ఉంటోంది. అయితే.. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని ఆస్పత్రిలో జాయిన్ చేపిస్తా అని చెప్పి బయటనే వదిలేసి వెళ్లిపోయాడు. ఎంతకీ కొడుకు […]

ఓ కసాయి కొడుకు రాక్షతత్వం
Follow us

| Edited By:

Updated on: Feb 18, 2019 | 6:56 AM

నవమాసాలు మోసి.. కనిపెంచిన తల్లిని నిర్దాక్షణ్యంగా వదిలి వెళ్లిపోయాడు. అనారోగ్యంతో ఉన్న అమ్మను హాస్పిటల్లో చేర్పిస్తానని తీసుకొచ్చి.. ఆస్పత్రి ఆవరణలో వదిలేసి వెళ్లిపోయాడు. మహాబూబాద్ లో జరిగిన ఈ ఘటన అందరిచేత కంటతడి పెట్టించింది. విజయవాడకు చెందిన తాటి రాములమ్మకు ముగ్గురు కొడుకులు, ఓ కూతురు. ఇద్దరు కొడుకులు చనిపోవడంతో మిగిలిన కుమారుడు పాపయ్య దగ్గర ఉంటోంది. అయితే.. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని ఆస్పత్రిలో జాయిన్ చేపిస్తా అని చెప్పి బయటనే వదిలేసి వెళ్లిపోయాడు. ఎంతకీ కొడుకు తిరిగి రాకపోవడంతో.. ఆ తల్లి తిండిలేక, ఆకలికి అలమటిస్తూ.. చలికి వణికిపోతూ.. నరకం అనుభవించింది. వృద్ధురాలి దీనస్థితిని చూసిన హాస్పిటల్ వైద్యులు స్పందించారు. ఆమెను ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. సిబ్బంది ఆమెకు అన్నంపెట్టి ఆదరిస్తున్నారు. కన్నతల్లిని భారంగా భావించిన పాపయ్య పాపాత్ముడని శాపనార్థాలు పెడుతున్నారు స్థానికులు.