మురగదాస్‌ ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్‌.. ప్రముఖ హాలీవుడ్‌ స్టూడియో డిస్నీ పిక్చర్స్ నిర్మాణంలో మూవీ

కోలీవుడ్‌ స్టార్ డైరెక్టర్ ఏఆర్‌ మురగదాస్ ఇంటర్నేషనల్‌ మూవీని తీయబోతున్నారా..! ప్రముఖ హాలీవుడ్ సంస్థ డిస్నీ పిక్చర్స్‌ నిర్మాణంలో ఆయన సినిమా చేయబోతున్నారా..!

  • Tv9 Telugu
  • Publish Date - 9:23 pm, Tue, 24 November 20

Murugadoss Hollywood movie: కోలీవుడ్‌ స్టార్ డైరెక్టర్ ఏఆర్‌ మురగదాస్ ఇంటర్నేషనల్‌ మూవీని తీయబోతున్నారా..! ప్రముఖ హాలీవుడ్ సంస్థ డిస్నీ పిక్చర్స్‌ నిర్మాణంలో ఆయన సినిమా చేయబోతున్నారా..! అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. అది కూడా లైవ్‌ యాక్షన్‌ యానిమేషన్ ఫిల్మ్‌ అని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్‌లో లోకల్‌ టెక్నీషియన్లతో పాటు ఇంటర్నేషనల్‌ టెక్నీషియన్లు కూడా భాగం కానున్నట్లు టాక్‌. అంతేకాదు దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. (మంచు విష్ణు- శ్రీను వైట్లల ‘ఢీ అండ్‌ ఢీ’.. ఆ ఇద్దరు హీరోయిన్లలో ఒకరిని ఫిక్స్ చేయనున్నారా..!)

కాగా ఈ ఏడాది రజనీకాంత్ నటించిన దర్బార్‌కి మురగదాస్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి మిక్స్‌డ్‌ టాక్ వచ్చింది. ఇక ఆ తరువాత విజయ్‌తో తుపాకీ సీక్వెల్‌ని ప్రకటించారు మురగదాస్‌. కానీ క్రియేటివ్‌ డిఫరెన్స్‌లు రావడంతో ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోయింది. ఈ క్రమంలో మురగదాస్‌కి హాలీవుడ్‌ ఆఫర్ కన్ఫర్మ్ అయినట్లు టాక్‌. (వినియోగదారులకు గూగుల్‌ పే షాకింగ్‌ న్యూస్‌.. నిలిచిపోనున్న వెబ్‌ యాప్ సేవలు.. అంతేకాదు..! )