Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

సామాన్యులకు షాక్.. త్వరలో 2వేల నోట్ల రద్దు..?

Reserve Bank of India, సామాన్యులకు షాక్.. త్వరలో 2వేల నోట్ల రద్దు..?

ప్రజలకు మరో షాక్ తగలనుందా..? త్వరలో 2వేల నోట్లు రద్దు కానున్నాయా..? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి బ్యాంకులన్నింటికి ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో బ్యాంకులకు వెళ్లిన ఖాతాదారులకు 2వేల నోట్లను ఇవ్వడం తగ్గించాలని ఓ ప్రముఖ బ్యాంక్ తమ ఉద్యోగులకు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏటీఎంలలోనూ 2వేల నోట్లను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే ఖాతాదారుల నుంచి ఆ నోట్లను తీసుకునేందుకు వారిని ఇబ్బందులు పెట్టొద్దని ఆ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

అయితే నోట్ల రద్దు తరువాత మార్కెట్‌లోకి వచ్చిన రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేయబోతున్నట్లు గతంలోనూ పలుమార్లు ప్రచారం జరిగింది. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఆ మధ్యన ఈ నోట్ల ముద్రణను తగ్గిస్తూ వచ్చిన ఆర్బీఐ మిగిలిన నోట్ల ప్రింటింగ్‌ను పెంచుతున్నట్లు వార్తలు వచ్చాయి. పాకిస్తాన్‌లో మన రూ.2వేల నకిలీ నోట్లను ప్రింట్ చేశారనే అనుమానాల నేపథ్యంలో ఈ నోట్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తే ప్రజల్లో మరోసారి ఆందోళనలు పెరిగే అవకాశం ఉండొచ్చనే భావనలో ఉన్న బ్యాంకులు.. వచ్చిన నోట్లను రిజర్వ్ బ్యాంకుకు తరలించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వాటిని తిరిగి చలామణిలో పెట్టకుండా, క్రమక్రమంగా మొత్తం రూ.2వేల నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Tags