Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

బీరండీ బాబూ..బీరు… ఇది ఆడోళ్ళ బీరు !

Female Beer, బీరండీ బాబూ..బీరు…  ఇది ఆడోళ్ళ బీరు !

అదేంటీ ? బీర్లలో ఆడా, మగా అనే తేడా కూడా ఉంటుందా ? నిజమా ? అని సందేహంతో గుచ్చి… గుచ్చి అడిగే అనుమానపురాయుళ్లకు..
ఎస్ ! నిజంగా ఉంటుందనే అంటున్నారు గుర్ గావ్ లోని ఓ పబ్ నిర్వాహకులు. మనుషుల్లో ఈ లింగ భేదం ఉన్నప్పుడు లైట్ డ్రింకుల్లో మాత్రం ఎందుకు ఉండకూడదని ప్రశ్నిస్తున్నారు. ఆ బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టిని తామేమీ చేయలేకపోయినా.. కనీసం బీర్ లాంటి సాధారణ డ్రింకుల్లోనైనా కొత్త పేరుతో.. సరికొత్త ‘ సృష్టి ‘ కి నాంది పలకాలనుకున్నారు.
అందుకే ఓ వెరైటీ కాన్సెప్ట్ తో ‘ ఫిమేల్ బీర్ ‘ పేరిట కొత్త బ్రాండ్ బీర్ లాంచ్ చేశారు. అంటే… ఇందులోని విశేషమేమిటంటే.. దీని టేస్టేనట ! మామూలు బీర్ లో మాదిరి కాకుండా ఇందులో చేదు ఉండదని, కాస్త స్వీట్ గా కూడా ఉంటుందని ‘ ఆర్థర్.. 29 ‘ అనే ఈ పబ్ వారు సెలవిస్తున్నారు. చాలామంది మహిళలు, యువతులు సాధారణ బీరులోని చేదును , స్ట్రాంగ్ నెస్ ని ఇష్టపడరని, అందువల్లే చాలా ఆలోచించి.. సుమారు నెల క్రితం ఈ ఫిమేల్ బీర్ ను ప్రవేశపెట్టామని వారంటున్నారు.Female Beer, బీరండీ బాబూ..బీరు…  ఇది ఆడోళ్ళ బీరు !

మా పబ్ కు వచ్ఛే లేడీస్ సాధారణ బీరులోని చేదును లైక్ చేయడంలేదు. వాళ్ళు కోక్ నో, మరో డ్రింకునో అందులో మిక్స్ చేసి తాగుతారు.. ఈ విషయాన్ని గమనించి మేం కాస్త తియ్యదనం వచ్ఛేలా , లైట్ గా ఉండేలా చూసేందుకు దీన్ని ఇలా సప్లై చేస్తున్నాం అని వారంటున్నారు. అన్నట్టు ఇది తాగితే ‘ ఆడపులి ‘ లాగే మహిళలు ‘ చెలరేగిపోతారని,’.. వాళ్లలో ఉత్సాహం, తెగువ ఇనుమడిస్తాయని ‘ డబ్బా ‘ కొట్టుకున్నారు ఈ పబ్బోళ్ళు ! పైగా ‘ ఆర్డర్-29 ‘ ‘ ఇండియన్ ఫస్ట్ ఫిమేల్ బీర్ ‘ అని తెగ అడ్వర్టైజ్ చేసి ఊరిస్తున్నారు. దీన్నిలాంచ్ చేశాక తమ పబ్ కి డిమాండ్ పెరిగిందని కూడా హ్యాపీగా చెప్పుకున్నారు. పైగా ఈ బీర్ తో కూడిన గ్లాస్ కూడా వెరైటీగా ఉండడం విశేషం.