ప్లాస్టిక్ నుంచి పెట్రోల్… రూ.40కే లీటర్!

హైదారాబాద్ కు చెందిన‌ 45 ఏళ్ల మెకానిక‌ల్ ఇంజినీర్ ప్రొఫెసర్ సతీశ్ కుమార్… ఉపయోగించిన ప్లాస్టిక్‌తో పెట్రోల్ తయారీతో ముందుకు వచ్చారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ వద్ద ఒక కంపెనీని రిజిస్టర్ కూడా చేయించారు. ‘ప్లాస్టిక్‌ను డీజిల్‌గా, పెట్రోల్‌గా, విమాన ఇంధనంగా రీసైకిల్ చేస్తారు. దాదాపు 500 కేజీల నాన్ రీసైక్లబుల్ ప్లాస్టిక్‌తో 400 లీటర్ల ఇంధనాన్ని తయారు చేయవచ్చు. ఇది చాలా సరళమైన ప్రక్రియ. నీళ్లతో అవసరం లేదు. అలాగే ఎలాగే ఎలాంటి మురికి నీరు ఉత్పత్తి కాదు’ అని కుమార్ ఒక మీడియాకు తెలిపారు.

2016 నుంచి కుమార్ 50 టన్నుల నాన్ రీసైక్లబుల్ ప్లాస్టిక్‌ను ఇంధనంగా మార్చారు. ప్రస్తుతం ఈయన కంపెనీ రోజుకు 200 లీటర్ల పెట్రోల్‌ను ఉత్పత్తి చేస్తోంది. దీని కోసం 200 కేజీల ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తోంది. ఈ పెట్రోల్‌ను స్థానిక పరిశ్రమలకు లీటరుకు రూ.40 నుంచి రూ.50 ధరతో విక్రయిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *