Ponniyin Selvan : ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా వెబ్ సిరీస్.. సంగీతం అందించనున్న ఇళయరాజా..

స్టార్ డైరెక్టర్ మణిరత్నం మెగా ప్రాజెక్ట్ 'పొన్నియన్ సెల్వన్' తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. 'పొన్నియన్ సెల్వన్' అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ...

Ponniyin Selvan : 'పొన్నియన్ సెల్వన్' నవల ఆధారంగా వెబ్ సిరీస్.. సంగీతం అందించనున్న ఇళయరాజా..
Follow us

|

Updated on: Jan 15, 2021 | 5:56 PM

Ponniyin Selvan : స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ‘పొన్నియన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను  భారీ తారాగణంతో  చేస్తున్నారు మణిరత్నం. కాగా ఈ సినిమాలో చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, ప్రకాశ్ రాజ్ నటిస్తుండగా ఐశ్వర్య రాయ్ ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకోసం భారీ సెట్ ను నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే  ఈ నవల ఆధారంగా మరో వెబ్ సిరీస్ తెరకెక్కబోతుంది. ఈ వెబ్ సిరీస్ కు ‘ చిరంజీవి పొన్నియన్ సెల్వన్’అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సిరీస్ కు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజ సంగీతం అందిస్తున్నారు. ఇక అజయ్ ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. 2022లో ఈ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసురానున్నారు. ఏప్రిల్ 14న ఈ వెబ్ సిరీస్ లో నటించే నటీనటులను వెల్లడిస్తామని దర్శకుడు అజయ్ తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Red movie : సూపర్ హిట్ దిశగా దూసుకుపోతున్న’రెడ్’.. మొద‌టి రోజు కలెక్షన్లు ఎంతంటే..