అతని నాలుక విలువ రూ.92 కోట్లు..ఎందుకంటే..

ఇన్సూరెన్స్‌ అనగానే మనకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌, వెహికల్‌ ఇన్సూరెన్స్‌ గుర్తొస్తాయి. కానీ మనిషిలోని ఒక్కో అవయవానికి ఇన్సూరెన్స్‌ చేయొచ్చని మీకు తెలుసా. అవునా అలాంటి కంపెనీ ఉందా అనుకుంటున్నారా..ఉందండీ. లండన్‌లోని ఇన్సూరెన్స్‌ కంపెనీ లాయిడ్‌..మనిషిలోని బాడీ పార్ట్‌లకు ఇన్యూరెన్స్‌ కల్పిస్తుందట. ప్రస్తుతం ఓ సెలబ్రిటీ నాలుకకు ఇన్సూరెన్స్‌ చేసింది ఈ కంపెనీ. అది కూడా వేలు, లక్షలు కాదు. ఏకంగా 92 కోట్లకు ఇన్సూరెన్స్‌ చేశారు.  కోస్టా కాఫీని టేస్ట్‌ చేసే జెన్నారో పెల్లీక్కియా..తన నాలుకకు 2009లో […]

అతని నాలుక విలువ రూ.92 కోట్లు..ఎందుకంటే..
Follow us

|

Updated on: Dec 18, 2019 | 7:20 PM

ఇన్సూరెన్స్‌ అనగానే మనకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌, వెహికల్‌ ఇన్సూరెన్స్‌ గుర్తొస్తాయి. కానీ మనిషిలోని ఒక్కో అవయవానికి ఇన్సూరెన్స్‌ చేయొచ్చని మీకు తెలుసా. అవునా అలాంటి కంపెనీ ఉందా అనుకుంటున్నారా..ఉందండీ. లండన్‌లోని ఇన్సూరెన్స్‌ కంపెనీ లాయిడ్‌..మనిషిలోని బాడీ పార్ట్‌లకు ఇన్యూరెన్స్‌ కల్పిస్తుందట. ప్రస్తుతం ఓ సెలబ్రిటీ నాలుకకు ఇన్సూరెన్స్‌ చేసింది ఈ కంపెనీ. అది కూడా వేలు, లక్షలు కాదు. ఏకంగా 92 కోట్లకు ఇన్సూరెన్స్‌ చేశారు.  కోస్టా కాఫీని టేస్ట్‌ చేసే జెన్నారో పెల్లీక్కియా..తన నాలుకకు 2009లో ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. అతని నాలుక విలువను రూ. 92 కోట్లుగా డిసైడ్‌ చేసింది కంపెనీ.

నాలుకకు అంత రేటు ఎందుకని అనుకుంటున్నారా..? కోస్టా సోదరులు 1971లో మోచా ఇటాలియా కాఫీ బ్లెండ్‌ తయారుచేశారు. దాన్ని బ్రిటన్‌లోని బెస్ట్‌ కాఫీ బ్రాండైన కోస్టా కాఫీ షాప్‌లో అమ్మారు. ప్రస్తుతం ఆ కాఫీని టేస్టూ చేస్తూ ఉంటాడు జెన్నారో.  ఏ మాత్రం తేడా వచ్చినా వెనక్కి పంపించేస్తాడట. ఎక్కడా రాజీపడడట. అతను మాత్రమే ఆ పనిని కరెక్టుగా చేస్తుండటంతో..ఆయన నాలుకను 92కోట్లకు ఇన్సూరెన్స్‌ చేసింది కంపెనీ.

లండన్‌లోని లాంబెర్త్‌ రోస్టరీలో పనిచేస్తున్న జెన్నారోకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుంది. చాలా దేశాల్లో కాఫీ తయారీ క్లాసులిస్తుంటాడు. ప్రపంచంలో ఏయే దేశాల్లో కాఫీ గింజలు పండుతాయో..వాటి రుచి ఎలా ఉంటుందో జెన్నారోకు బాగా తెలుసు. అదెలా అంటే ఇటలీలోని నేపుల్స్‌లో పుట్టిన జెన్నారోకు చిన్నప్పటినుంచే పాలలో కాస్త కాఫీ కలిపి ఇచ్చేదట అతని తల్లి. దీంతో అలా కాఫీ రుచులకు అలవాడు పడ్డాడు. చదువుకునే రోజుల్లోనే బరిస్టా అనే కాఫీ షాప్‌లో పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేసేవాడు. ఆ తర్వాత రోస్టరీలో చేరి కాఫీని టేస్ట్‌ చేస్తున్నాడు. అక్కడికి ప్రపంచంలోని హైక్లాస్‌ సెలబ్రిటీలు వస్తుంటారు. దీంతో జెన్నారో తన నాలుకను అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. అతని టంగ్‌ రోస్టరీకి ముఖ్యం కావడంతో 10లక్షల పౌండ్లను ఇన్సూరెన్స్‌ ప్రీమియంగా చెల్లించింది.

స్టార్ హీరోకు అభిమాని దిమ్మతిరిగే గిఫ్ట్.! అది దా అభిమానం అంటే..
స్టార్ హీరోకు అభిమాని దిమ్మతిరిగే గిఫ్ట్.! అది దా అభిమానం అంటే..
వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే