సూపర్బ్ జాబ్ ఆఫర్.. కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్తే రూ. 29 లక్షల జీతం.!

కుక్కను ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్లపై తిప్పేందుకు ఓ డాగ్ వాకర్ కావాలని.. అందుకుగానూ సంవత్సరానికి రూ. 29 లక్షలు) చెల్లిస్తామని…

  • Ravi Kiran
  • Publish Date - 7:54 am, Tue, 27 October 20

Professional Dog Walker Job: ప్రపంచంలో ఎన్నో రకాల జాబ్స్ ఉంటాయి. అయితే వాటిల్లో కొన్నింటిని వినప్పుడు మాత్రం మనకు ఎక్కడలేని క్యూరియాసిటీ వస్తుంది. రుచి చూస్తే చాలు లక్షల్లో జీతం.. నిద్రపోతే లక్ష మీ సొంతం అంటూ కొన్ని ప్రకటనలు చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ వినడానికి చిత్రంగా అనిపిస్తున్నా.. వాస్తవానికి నిజం. తాజాగా ఇలాంటి జాబ్ ఒకదాన్ని లండ‌న్‌కు చెందిన ‘జోసఫ్ హేజ్ ఆరోన్‌సన్’ అనే న్యాయవాద సంస్థ ప్రకటించింది. కుక్కను ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్లపై తిప్పేందుకు ఓ డాగ్ వాకర్ కావాలని.. అందుకుగానూ సంవత్సరానికి 30 వేల పౌండ్లు(ఇండియన్ కరెన్సీలో రూ. 29 లక్షలు) చెల్లిస్తామని ఆ సంస్థ ప్రకటించింది.

”మా కంపెనీలో పని చేస్తున్న ఓ సీనియర్ ఉద్యోగికి పెంపుడు కుక్క ఉందని.. దాన్ని క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌కు తీసుకెళ్లాలి. ఇందుకు ఇంటరెస్ట్ ఉన్నవారు మమ్మల్ని సంప్రదించవచ్చు. దానికి గానూ ఏడాదికి జీతం 30 వేల పౌండ్లు( రూ. 29 లక్షలు) ఇస్తాం. ఆడ, మగ ఎవరైనా కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా కుక్కలను ప్రేమించేవారు ఈ ఉద్యోగానికి అర్హులని మర్చిపోవద్దు. జీతంతో పాటు పెన్షన్, జీవిత, ఆరోగ్య, డెంటల్ బీమా సదుపాయాలను కూడా ఉంటాయి. అంతేకాదు శనివారం, ఆదివారం సెలవులు తీసుకోవచ్చు. ఇంకొన్ని కీలక నిబంధనలు కూడా ఉన్నాయి” అని ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఈ ప్రకటనకు చాలామంది స్పందించడమే కాకుండా వెల్లువలా దరఖాస్తులు వచ్చి పడుతున్నాయట.