ఈ నాలీవుడ్ చిత్రం చాలా ప్ర‌త్యేకం…

ఓ సినిమా పోస్ట‌ర్ లో ఇద్ద‌ర‌మ్మాయిలు పక్క‌నే, ప‌క్క‌నే ప‌డుకుని ఉన్నారు. ఒక‌రి క‌ళ్ల‌లోకి ఒక‌రు ఘాడంగా చూస్తున్నారు. వారిలో ఒక యువ‌తి మ‌రో యువతి జుట్టును చేతితో తాకుతున్న‌ట్లు ఉంది.

ఈ నాలీవుడ్ చిత్రం చాలా ప్ర‌త్యేకం...
Follow us

|

Updated on: Jul 25, 2020 | 11:38 PM

ఓ సినిమా పోస్ట‌ర్ లో ఇద్ద‌ర‌మ్మాయిలు పక్క‌నే, ప‌క్క‌నే ప‌డుకుని ఉన్నారు. ఒక‌రి క‌ళ్ల‌లోకి ఒక‌రు ఘాడంగా చూస్తున్నారు. వారిలో ఒక యువ‌తి మ‌రో యువతి జుట్టును చేతితో తాకుతున్న‌ట్లు ఉంది. అవును వారు ప్రేమ‌లో ఉన్నట్లు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. ఇలాంటి సినిమాలు హాలివుడ్ లో బోలెడు వ‌స్తుంటాయి. కానీ నైజీరియా చిత్ర ప‌రిశ్ర‌మ నాలీవుడ్లో ఈ త‌ర‌హా చిత్రాలు నిషిద్దం. కానీ నైజీరియా ఫిల్మ్ మేక‌ర్ ఉయైదు ఇక్పే-ఎటిమ్ తన కొత్త చిత్రం ఇఫే తో కొత్త‌ ధోర‌ణికి తెర‌తీశారు.

“ఇఫే” అంటే నైజీరియాలోని యోరుబా భాషలో ప్రేమ అని అర్థం. ఈ సినిమా క‌థ ఇద్ద‌రు యువ‌త‌లు మ‌ధ్య ప్రేమ బంధానికి సంబంధించి సాగుతోంది. హోమోఫోబియా ప్రబలంగా నడుస్తున్న నైజీరియాలో, ఇక్పే-ఎటిమ్ దేశంలోని లెస్బియన్, గే, ద్విలింగ, ట్రాన్స్, క్వీర్ (ఎల్‌జిబిటిక్యూ) కమ్యూనిటీకి న్యాయవాది కూడా పనిచేస్తున్నారు. నైజీరియాలో స్వలింగసంపర్కం చట్టవిరుద్ధం. ఆ దేశంలో ఎవ‌రైనా స్వలింగ సంపర్కానికి పాల్పడితే 14 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల‌ని 2014 స్వలింగ వివాహ నిషేధ చట్టం పేర్కొంది. నైజీరియా మానవ హక్కుల సంస్థ ది ఇనిషియేటివ్ ఫర్ ఈక్వల్ రైట్స్ 2019 చేసిన సర్వేలో దేశంలో 75% మంది ప్ర‌జ‌లు స్వలింగ వ్యతిరేక చట్టాలను నిరంతరం మద్దతు ఇస్తున్నట్లు కనుగొన్నారు. అక్క‌డ ఇటువంటి సినిమాతో హ‌క్కుల గురించి ప్ర‌శ్నించ‌డం నిజంగా సాహ‌స‌మే అని చెప్పుకోవాలి.