ఏపీలో కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు..కాకినాడ తీరంలో 2 విదేశీ కార్గో షిప్ లు ..

ఏపీలో కరోనా కేసులు ఒక్కసారిగా 40కి చేరాయి. ఈ ఒక్క రోజే 17 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం క‌ల‌క‌లం రేపుతోంది. ఆ 17 మందిలో చాలా మంది ...

ఏపీలో కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు..కాకినాడ తీరంలో 2 విదేశీ కార్గో షిప్ లు ..
Follow us

|

Updated on: Mar 31, 2020 | 12:13 PM

ఏపీలో కరోనా కేసులు ఒక్కసారిగా 40కి చేరాయి. ఈ ఒక్క రోజే 17 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం క‌ల‌క‌లం రేపుతోంది. ఆ 17 మందిలో చాలా మంది ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారే ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. మొత్తం 147 శాంపిళ్ల‌ను పరీక్షిస్తే వాటిలో 17 కేసులు పాజిటివ్ వచ్చినట్లు బులిటెన్ లో వెల్ల‌డించారు.

జిల్లాల వారీగా మొత్తం కేసులు ప‌రిశీలించిన‌ట్లైతే.. ప్రకాశం 11, గుంటూరు 9, విశాఖ 6, కృష్ణా 5, తూర్పుగోదావ‌రి 4, అనంతపురం 2, నెల్లూరు, చిత్తూరు, కర్నూల్ జిల్లాలో ఒక్కొక్కటి అనంతపురం జిల్లాలో పదేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజా కేసుల్లో 9 మంది డిల్లీ సమావేశంలో పాల్గొన్న వారు కాగా, మరో ఐదుగురు వారి బంధువులు, కాంటాక్ట్ కేసులు ఉన్న‌ట్లుగా వైద్య ఆరోగ్య శాఖ స్ప‌ష్టం చేసింది.

కాకినాడ తీరంలో హల్దియా, ఇండోనేసియాకు చెందిన కార్గో షిప్ లు.. మ‌రోవైపు కాకినాడ తీరం లో హాల్దియా, ఇండోనేషియా కు చెందిన రెండు కార్గో షిప్ లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. అధికారులు ఓడ సిబ్బందిని బయటకు రానీయకుండా షిప్ లోనే ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించి 14 రోజులు క్వారంటైన్ విధించారు. షిప్ నుంచి కిందకు దిగవద్దని విదేశీయులకు అధికారులు సూచించారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా హై టెన్ష‌న్ నెల‌కొంది. రాబోవు రోజుల్లో క‌రోనా మ‌హ‌మ్మారి ఏం స్థాయిలో విస్త‌రిస్తోంద‌న‌నే భ‌యందోళ‌న‌లో ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటున్నారు.