పైథాన్ కాదు… బాబోయ్… పొడవాటి జుట్టే !

బీహార్ లోని ముంగేర్ జిల్లాకు వెళ్తే అక్కడో విచిత్రమైన వ్యక్తి కనిపిస్తాడు. అతనిపేరే సకల్ దేవ్ టుడ్డు .. సుమారు 63 ఏళ్ళ ఈ వ్యక్తి అసాధారణంగా కనిపించడమే విశేషం. కారణం.. ఈయన జుట్టు దాదాపు ఆరడుగుల పొడవుంది. 40 ఏళ్లుగా ఈయన తన జుట్టును కత్తిరించు కోలేదట.. ఇందుకు ఓ పెద్ద కారణమే ఉంది. నలభై సంవత్సరాల క్రితం రాత్రి నిద్రలో తనకు దేవుడు కలలో కనబడి .. నీ జుట్టును కత్తిరించుకోవద్దని సలహా ఇచ్చాడట.. […]

పైథాన్ కాదు... బాబోయ్...  పొడవాటి జుట్టే !
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 17, 2019 | 2:01 PM

బీహార్ లోని ముంగేర్ జిల్లాకు వెళ్తే అక్కడో విచిత్రమైన వ్యక్తి కనిపిస్తాడు. అతనిపేరే సకల్ దేవ్ టుడ్డు .. సుమారు 63 ఏళ్ళ ఈ వ్యక్తి అసాధారణంగా కనిపించడమే విశేషం. కారణం.. ఈయన జుట్టు దాదాపు ఆరడుగుల పొడవుంది. 40 ఏళ్లుగా ఈయన తన జుట్టును కత్తిరించు కోలేదట.. ఇందుకు ఓ పెద్ద కారణమే ఉంది. నలభై సంవత్సరాల క్రితం రాత్రి నిద్రలో తనకు దేవుడు కలలో కనబడి .. నీ జుట్టును కత్తిరించుకోవద్దని సలహా ఇచ్చాడట.. దాంతో సకల్ దేవ్ ఇక దాని జోలికి పోలేదు. ఇతని గ్రామంలో అంతా ఇతడ్ని ‘ మహాత్మాజీ ‘ అని గౌరవప్రదంగా పిలుస్తారు. సంతానం లేని జంటలకు సకల్ దేవ్ తన దగ్గరున్న ఆయుర్వేద మందులిస్తాడు. 31 సంవత్సరాల పాటు అటవీ శాఖలో పని చేసిన ఈయనకు భార్య, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. తన కేశాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ దానికి ప్రత్యేక తైలాలను మర్డన చేస్తూ అతి అపురూపంగా చూసుకుంటున్నాడు సకల్ దేవ్. ఇతని భార్యా పిల్లలు కూడా ఈ విషయంలో ఇతనికి పూర్తిగా సహకరించడం కొసమెరుపు. .