లాక్‌డౌన్ ఎఫెక్ట్ : పోలీసులు వేధించారంటూ..యువ‌కుడు సూసైడ్

ప్ర‌స్తుతం దేశంలో ఉన్న క‌రోనా లాక్‌డౌన్ వల్ల పోలీసుల‌కు, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య‌ స్మాల్ గ్యాప్ క‌నిపిస్తోంది. త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి పోలీసులు రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నారు. నిజ‌మే కానీ…వారిలో కొంత‌మంది అనుచితంగా ప్ర‌వ‌ర్తించ‌డం వ‌ల్ల అంత‌లా సేవ చేస్తోన్న అందరికీ చెడ్డ‌పేరు వ‌స్తోంది. ఈ క్రమంలో త‌న చావుకు పోలీసులే కార‌ణ‌మంటూ ఓ యువ‌కుడు ఏపీలో ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. లాక్‌డౌన్ వ‌ల్ల సొంతూరికి బయలుదేరిన క్రమంలో తన ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని..అనుచితంగా ప్ర‌వ‌ర్తించార‌నే […]

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : పోలీసులు వేధించారంటూ..యువ‌కుడు సూసైడ్
Follow us

|

Updated on: Apr 03, 2020 | 7:45 AM

ప్ర‌స్తుతం దేశంలో ఉన్న క‌రోనా లాక్‌డౌన్ వల్ల పోలీసుల‌కు, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య‌ స్మాల్ గ్యాప్ క‌నిపిస్తోంది. త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి పోలీసులు రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నారు. నిజ‌మే కానీ…వారిలో కొంత‌మంది అనుచితంగా ప్ర‌వ‌ర్తించ‌డం వ‌ల్ల అంత‌లా సేవ చేస్తోన్న అందరికీ చెడ్డ‌పేరు వ‌స్తోంది. ఈ క్రమంలో త‌న చావుకు పోలీసులే కార‌ణ‌మంటూ ఓ యువ‌కుడు ఏపీలో ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. లాక్‌డౌన్ వ‌ల్ల సొంతూరికి బయలుదేరిన క్రమంలో తన ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని..అనుచితంగా ప్ర‌వ‌ర్తించార‌నే మనస్థాపంతో స‌ద‌రు యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో గురువారం జ‌రిగింది.

పోలీసులు తెలిపిన డిటేల్స్ ప్రకారం.. కృష్ణా జిల్లా మండపల్లి మండలం పుట్లచెరువు గ్రామానికి చెందిన పేడాడ శ్రీనివాసరావు…చిత్తూరు జిల్లా నగరిలో ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. కరోనా ప్ర‌భావంతో రాష్ట్రంలో గ‌వ‌ర్న‌మెంట్ లాక్‌డౌన్‌ ప్రకటించడంతో తన టూ వీల‌ర్ పై మార్చి 31వ తేదీన నగరి నుంచి సొంతూరికి బయల్దేరాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం గుంటూరు-ప్రకాశం జిల్లాల బోర్డ‌ర్ స్టూవర్టుపురం చెక్‌పోస్టు వద్దకు రాగానే వెదుళ్లపల్లి పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. బైక్ ను సీజ్ చేసి.. యువకుడిపై కేసు నమోదు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అదే రోజు రాత్రి వ్యక్తిగత పూచీకత్తుపై శ్రీనివాసరావుని పోలీసులు విడిచిపెట్టారు.

పోలీస్‌స్టేషన్‌ నుంచి వెళ్లిన శ్రీనివాసరావు….త‌ర్వాతి రోజు ఉద‌యం బాపట్ల సిటీలోని కొత్తబస్టాండు ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. గమనించిన స్థానికులు వెంట‌నే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం జ‌రిపించారు. అనంతరం బాడీని ఫ్యామిలీ మెంబ‌ర్స్ కు అప్పగించారు. అయితే త‌న బైక్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అనుచితంగా వ్యవహరించారని.. తన మరణానికి వెదుళ్లపల్లి పోలీసులే కారణమంటూ చనిపోయేముందు శ్రీనివాసరావు సెల్ఫీ వీడియోలో త‌న ఆవేద‌న‌ను వెళ్ల‌క‌క్కాడు. ఈ వీడియో గురువారం సాయంత్రం సోష‌ల్ మీడియాలో వైరల్‌ అయింది. అయితే దీనిపై పోలీసులు వెర్ష‌న్ మాత్రం వేరే విధంగా ఉంది. ఆర్థిక ఇబ్బందుల వల్లే శ్రీనివాసరావు సూసైడ్ చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు.