బీరు లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా..

A lorry loaded with beer bottle over turns in begumpet, బీరు లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా..

హైదరాబాద్ బేగంపేట ఫ్లై ఓవర్ దగ్గర బీర్ లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఫ్లై ఓవర్ ఎక్కే క్రమంలో కారును తప్పించబోయి డివైడర్‌ను ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. లారీ బీర్ లోడ్‌తో సంగారెడ్డి నుంచి ఉప్పల్ వెళ్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ యాక్సిడెంట్ జరిగినట్లు భావిస్తున్నారు. బీర్లన్నీ రోడ్డు మీదే ఉండటంతో వాటిని దొంగిలించేందుకు స్థానికులు ఎగబడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. వాటిని చోరికి గురికాకుండా కాపలా కాస్తున్నారు. వాహనదారులు బీర్ లోడును చూసేందుకు ఎగబడ్డారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *