Breaking News
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. వైద్య పరీక్షల కోసం గుంటూరు మెడికల్‌ కాలేజీలో కరోనా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు అధికారులు.
  • మందు తాగితే తూలడం, మందు లేకపోతే మతిస్థిమితం కోల్పోయినట్టుగా ప్రవర్తించడం.. ఇదే ఇప్పుడు అంతటా కనిపిస్తోంది.. కరోనా కాలంలో మందుబాబుల కష్టాలు అన్నీఇన్నీ కావు.. మద్యం దుకాణాలన్నీ బంద్‌.. బార్లు పబ్బులు బంద్‌.. తాగి తాగి పిచ్చెక్కిపోయిన మందుబాబులు చివరకు దొంగలుగా మారిపోయారు.
  • తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వెల్లూరు, తేంగాశి, కల్లకురిచి జిల్లాలలో పెరుగుతోన్న కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. తమిళనాడులో 411 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారిలో 64 మంది నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారే కావడం గమనార్హం.
  • కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంటి నుంచి బయటకు వెళితే మాస్క్‌ తప్పనిసరిగా వాడాలని కేంద్రం తెలిపింది. ఈ నియమాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందనని రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసు శాఖలను ఆదేశించింది.
  • లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌. అనవసరంగా రోడ్డు మీదకొస్తే వాహనాలు సీజ్‌ చేస్తామన్నారు.

మహిళలు గుండెజబ్బులు బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

, మహిళలు గుండెజబ్బులు బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గుండెజబ్బులు రావడానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. అయితే.. సమస్య వచ్చాక బాధపడేబదులు రాకముందే జాగ్రత్తపడడం చాలా అవసరం. ప్రస్తుత యాంత్రిక జీవనంలో మహిళలు కూడా గుండెజబ్బుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలోని న్యూ యూనివర్సిటీ మహిళల్లో వస్తున్న గుండెజబ్బులపై పలు సర్వేలు చేపట్టింది.
దాదాపుగా అమెరికన్ మహిళల్లో 25శాతంకి పైగా మహిళలు పనిచేయకుండా ఇన్ ఆక్టివ్ గా ఉంటున్నట్లు పరిశోధనల్లో గుర్తించారు. ఈ ప్రభావంతోనే దాదాపు 42శాతం మంది మహిళలు గుండెజబ్బుల బారిన పడుతున్నారని.. అంతే కాకుండా హార్ట్ అటాక్ తో ప్రాణాలు కూడా కొల్పోతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మహిళలు ఈ గుండె జబ్బుల బారి నుంచి బయటపడేందుకు పలు చిట్కాలను తెలిపారు.

కాలిఫోర్నియా యూనివర్సిటీ వైద్యులు చేపట్టిన సర్వేల్లో ప్రతి నలుగురి అమెరికన్ మహిళల్లో ఒకరు గుండెకు సంబంధించిన వ్యాధితో మృత్యువాత పడుతున్నట్లు తెలిపారు. అయితే వీరంతా కనీసం ఇంట్లో పనులు కానీ వ్యాయామం కానీ చేయకుండా ఉండేవారని గుర్తించారు. వీటివల్ల వీరంతా గుండెజబ్బులతో పాటుగా, అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్, అధిక కొలెస్ట్రాల్ వంటి రోగాల బారిన పడే అవకాశం ఉంది. అయితే ఈ రోగాల బారిన పడకుండా ఉండేందుకు వైద్యులు పరిశోధనలు చేపట్టారు. సాధారణంగా మహిళలు గుండెజబ్బుల బారిన పడటం అనేది చాలా తక్కువ. అయితే ఏ మాత్రం పనిచేయకుండా పూర్తిగా ఇన్ ఆక్టివ్ గా ఉండే మహిళలే ఈ గుండె జబ్బుల బారిన పడుతున్నారని.. వీరు కొంచెం జీవన శైలిని మార్చుకుంటే దీనిని అధిగమించవచ్చని యూనివర్సిటీ వైద్య బృందం తెలిపింది.

రోజులో సాధారణ వ్యాయామం కూడా అక్కర్లేకుండా మహిళలు గుండెజబ్బులు రాకుండా బయటపడొచ్చని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన శాన్ డియాగో పరిశోధక బృందం తెలిపింది. సుధీర్ఘంగా మూడున్నరేళ్లు దాదాపు 6వేల మంది మహిళలపై పరిశోధనలు చేపట్టారు. నిత్యం ఐదున్నర గంటల పాటు పనిచేస్తున్న వారు ఏలాంటి అనారోగ్యాలపాలు అవ్వడం లేదని గుర్తించారు. అలానే ఇంట్లో పనులు చేయకుండా ఉద్యోగం చేస్తూ.. జిమ్ కు వెళ్తున్న వారు కూడా గుండెజబ్బుల బారిన పడటం లేదని గుర్తించారు. అయితే జిమ్ వెళ్లడం కన్నా ఇంట్లో ఎక్కువ సమయం కూర్చోకుండా చిన్న చిన్న పనులు చేసినా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు.

, మహిళలు గుండెజబ్బులు బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రోజుకు సగటున ఐదున్నర గంటల పాటు ఇంట్లో పనిచేస్తే చాలని.. దీని ద్వారా గుండెజబ్బుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే లోపు మొత్తానికి ఐదున్నర గంటలపాటు శరీరంలో కదలికలు ఉంటే అదే చాలని.. ఇలా చేస్తే ఏలాంటి గుండెజబ్బులు దరిచేరవని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన శాన్ డియాగో వైద్య బృందం చెబుతోంది.

Related Tags