ప్రేమను కాదన్నందుకు…

తమిళనాడులో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించడం లేదన్న అక్కసుతో ఓ డిగ్రీ విద్యార్థినిని దారుణంగా హతమార్చాడు. కడలూరు జిల్లా విరుదాచలం దగ్గర ఉండే సుందరమూర్తి (50) భవన నిర్మాణ కార్మికుడు. అతడికి భార్య కొలుంజి, కుమార్తె తిలకవతి (19) ఉన్నారు. విరుదాచలం ఎరుమనూరు రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో తిలకవతి డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది. బుధవారం పని కోసం సుందరమూర్తి పక్క గ్రామానికి వెళ్లగా కొలుంజి బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లింది. కళావతి […]

ప్రేమను కాదన్నందుకు...
Follow us

| Edited By:

Updated on: May 10, 2019 | 5:37 PM

తమిళనాడులో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించడం లేదన్న అక్కసుతో ఓ డిగ్రీ విద్యార్థినిని దారుణంగా హతమార్చాడు. కడలూరు జిల్లా విరుదాచలం దగ్గర ఉండే సుందరమూర్తి (50) భవన నిర్మాణ కార్మికుడు. అతడికి భార్య కొలుంజి, కుమార్తె తిలకవతి (19) ఉన్నారు. విరుదాచలం ఎరుమనూరు రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో తిలకవతి డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది.

బుధవారం పని కోసం సుందరమూర్తి పక్క గ్రామానికి వెళ్లగా కొలుంజి బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లింది. కళావతి ఉదయం కాలేజీకి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న పక్క గ్రామం పేరలైయూరుకు చెందిన ఆకాశ్(19) ఇంట్లోకి ప్రవేశించాడు. తనతో తెచ్చుకున్న కత్తితో తిలకవతిని విచక్షణా రహితంగా పొడిచాడు. ఆమె కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకోగా నిందితుడు పారిపోయాడు. రక్తస్రావంతో బాధపడుతున్న తిలకవతిని స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది.

మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆకాశ్‌ను అరెస్ట్ చేశారు. ఆకాశ్‌ చదువు మధ్యలో ఆపేసి ఆవారాగా తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు. తిలకవతి కాలేజీకి వెళ్లే సమయంలో ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడని… ఆమె అతడి ప్రేమను తిరస్కరించడంతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడని వెల్లడించారు.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?