రగ్బీ ఆడుతున్న గొరిల్లా.. వావ్ !

The gorilla displayed some fine ball carrying skills, రగ్బీ ఆడుతున్న గొరిల్లా.. వావ్ !

మనుషులకే కాదు.. రగ్బీ ఆట ఆడడం మాకూ వచ్చు ‘ అంటోంది ‘ ఓ గొరిల్లా.. తమాషాగా రగ్బీ బాల్ ని పరీక్షగా చూసి అటూఇటూ విసిరేస్తూ హంగామా చేసింది. బ్రిటన్ లోని డేవాన్ లో గల జూ లో ఉందీ మగ గొరిల్లా..పెర్టినాక్స్ అని అంతా అపురూపంగా పిలుచుకునే 37 ఏళ్ళ ఈ గొరిల్లాకు బాల్స్ తో ఆడుకోవడమంటే సరదా అట.. త్వరలో జరగనున్న రగ్బీ అంతర్జాతీయ మ్యాచ్ లను పురస్కరించుకుని జూ నిర్వాహకులు వెరైటీగా ఓ బాల్ ని దీని ఎన్ క్లోజర్లో పడేయగానే.. పెర్టినాక్స్ దాన్ని క్యూరియస్ గా చూస్తూ కొద్దిసేపు ఆటలాడుకుంది. పైగా దాన్ని విడిచిపెట్టకుండా తన ‘ అప్పర్ ఎన్ క్లోజర్లోకి ‘ తీసుకుపోయింది. తాము ఈ బాల్ పై కొంత తేనె అద్దామని, దాంతో ఈ గొరిల్లా మరింత ఎట్రాక్ట్ అయిందని జూ నిర్వాహకులు చెబుతున్నారు. ఇది చూసిన విజిటర్లు వావ్ అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *