శ్యాం ప్రసాద్ ముఖర్జీ కల నెరవేరింది : రాం మాధవ్

జమ్ముకశ్మీర్‌పై కీలక ప్రకటనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఇది ఒక అద్భుతమైన రోజంటూ ట్వీట్ చేశారు. ఎట్టకేలకు జమ్ముకశ్మీర్‌ను భారత్‌లో పూర్తిగా విలీనం చేయాలన్న శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ మొదలుకొని ఎంతో మంది అమరుల త్యాగాలు ఫలించాయంటూ పేర్కొన్నారు. సమగ్ర భారతదేశం కోసం ఏడు దశాబ్దాలుగా సాగుతున్న పోరాటానికి ఇక తెరపడిందన్నారు. జీవితంతో అసలు ఇలాంటి పరిణామం వస్తుందని ఊహించామా.. అంటూ రామ్‌ మాధవ్‌ ట్వీట్‌ చేశారు.

అధికరణ 370 రద్దుతో పాటు, 35ఏ రద్దు, జమ్ముకశ్మీర్‌ను రెండు ప్రాంతాలుగా విభజిస్తూ అమిత్‌ షా రాజ్యసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. జమ్ము కశ్మీర్‌ను చట్టసభతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాఖ్‌ను చట్టసభలేని కేంద్రపాలిత ప్రాతంగా ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *