బ్రెజిల్‌లో కుంగిన భూమి..భారీ గుంత..తర్వాత ఏమైందంటే..

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో హఠాత్తుగా భూమి కుంగిపోయి భారీ గుంతలు పడటం చూశాం. వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు జరిగేవి. ఐతే వాటిని పరిశీలించిన భూగర్భ శాస్త్రవేత్తలు..భూమి కింది భాగంలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలనే ఇలా జరుగుతోందని నివేదిక ఇచ్చారు.  ఐతే ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే బ్రెజిల్‌లో జరిగింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి కుంగిపోయింది. బ్రెజిల్‌ రాజధాని బ్రెసీలియాలో కార్లు పార్క్‌ చేసి ఉన్న ప్రాంతంలో ఒక్క ఉదుటున భూమి కుంగిపోయింది. ఆ […]

బ్రెజిల్‌లో కుంగిన భూమి..భారీ గుంత..తర్వాత ఏమైందంటే..
Follow us

|

Updated on: Dec 11, 2019 | 2:03 PM

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో హఠాత్తుగా భూమి కుంగిపోయి భారీ గుంతలు పడటం చూశాం. వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు జరిగేవి. ఐతే వాటిని పరిశీలించిన భూగర్భ శాస్త్రవేత్తలు..భూమి కింది భాగంలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలనే ఇలా జరుగుతోందని నివేదిక ఇచ్చారు.  ఐతే ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే బ్రెజిల్‌లో జరిగింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి కుంగిపోయింది.

బ్రెజిల్‌ రాజధాని బ్రెసీలియాలో కార్లు పార్క్‌ చేసి ఉన్న ప్రాంతంలో ఒక్క ఉదుటున భూమి కుంగిపోయింది. ఆ ప్రాంతంలో పెద్ద గుంత ఏర్పడింది. దీంతో నాలుగు కార్లు అందులో పడిపోయాయి. ఓ భవనానికి కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు అక్కడ ఏం జరుగుతుందో తెలియక పరుగులు తీశారు. సమాచారమందుకున్న అధికారులు అక్కడికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. భూమి కుంగిపోవడానికి గల కారణాలను గుర్తించే పనిలో పడ్డారు.