చిటికెలతో దెయ్యం.. పోతుందా మరి భయం..?

వరంగల్ జిల్లా హన్మకొండలో చిటికెలతో దెయ్యం విడిపించేందుకు తెరమీదకొచ్చాడు ఓ వ్యక్తి. సఖీ ఉమెన్ కౌన్సిల్ సెంటర్‌లో దెయ్యం ఉందని దాన్ని విడిపిస్తానంటూ.. కేర్ సెంటర్ కు వచ్చి నానా హంగామా చేశాడు. ఇతనే మా గాడ్ అని దైవదూతగా బిల్డప్ ఇస్తూ డబ్బులు దండుకునే ప్రయత్నం చేశాడు. రాత్రి సమయంలో మీ శరీరంలో దెయ్యం చేరిందని అది గజ్జెల చప్పుడు చేస్తుందని కట్టు కథలు చెప్పి.. మహిళలని భయపెడుతున్నాడు. దీనికి పరిష్కారం తన వల్లే సాధ్యం […]

చిటికెలతో దెయ్యం.. పోతుందా మరి భయం..?
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2019 | 1:27 PM

వరంగల్ జిల్లా హన్మకొండలో చిటికెలతో దెయ్యం విడిపించేందుకు తెరమీదకొచ్చాడు ఓ వ్యక్తి. సఖీ ఉమెన్ కౌన్సిల్ సెంటర్‌లో దెయ్యం ఉందని దాన్ని విడిపిస్తానంటూ.. కేర్ సెంటర్ కు వచ్చి నానా హంగామా చేశాడు. ఇతనే మా గాడ్ అని దైవదూతగా బిల్డప్ ఇస్తూ డబ్బులు దండుకునే ప్రయత్నం చేశాడు. రాత్రి సమయంలో మీ శరీరంలో దెయ్యం చేరిందని అది గజ్జెల చప్పుడు చేస్తుందని కట్టు కథలు చెప్పి.. మహిళలని భయపెడుతున్నాడు. దీనికి పరిష్కారం తన వల్లే సాధ్యం అవుతుందని చిటికెలు వేస్తూ బిల్డప్ ఇచ్చాడు. అయితే కొద్ది రోజులుగా ఈ బిల్డింగ్ లో రకరకాల సౌండ్స్ వినిపిస్తున్నాయని సఖీ కౌన్సిలింగ్ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ క్రమంలో పలువురు ఉద్యోగులు అస్వస్తతకు గురయ్యారు. ఈ విషయాన్ని భవన నిర్వాహకులు దామోదర్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఉన్న ఉద్యోగులు ఈ భవనాన్ని ఖాళీ చేసి వెళిపోయారంటున్నారు. ఇప్పుడు వీళ్లు కూడా వెళిపోతారని కొత్త ప్లాన్ చేసిన ఆయన.. సమస్యను తాను చిటికెలో మాయం చేస్తానని దామోదర్ నమ్మించాడు. ఇదిలా ఉంటే మరోవైపు అలాంటిదేమి లేదని.. తమకు ఎలాంటి శబ్దాలు రావడం లేదని కౌన్సిల్ సెంటర్‌‌లో పనిచేసే కొందరు ఉద్యోగులు చెబుతున్నారు.