పోలీసులు బెదిరిస్తున్నారని..రైతు కుటుంబం ఆత్మ‌హ‌త్య‌..!

ప్ర‌కాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మోటార్ల చోరీ కేసులో తనను ఇరికించడంతో పాటు.. పోలీసులతోపాటు ప‌లువురు వ్య‌క్తులు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపిస్తూ మరుప్రోలు వీరాస్వామిరెడ్డి (37) అనే రైతు.. భార్య‌, 10 ఏళ్ల‌ కుమార్తెతో కలిసి విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. మృతుడి కుటుంబసభ్యులు, పోలీసుల తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. బసివిరెడ్డిపాలేనికి చెందిన రైతు శివనాగిరెడ్డి అనే వ్య‌క్తి తన పొలంలో మోటార్లు పోయాయని బాపట్ల రూర‌ల్ పోలీసులకు ఈ […]

పోలీసులు బెదిరిస్తున్నారని..రైతు కుటుంబం ఆత్మ‌హ‌త్య‌..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 26, 2020 | 5:53 PM

ప్ర‌కాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మోటార్ల చోరీ కేసులో తనను ఇరికించడంతో పాటు.. పోలీసులతోపాటు ప‌లువురు వ్య‌క్తులు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపిస్తూ మరుప్రోలు వీరాస్వామిరెడ్డి (37) అనే రైతు.. భార్య‌, 10 ఏళ్ల‌ కుమార్తెతో కలిసి విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది.

మృతుడి కుటుంబసభ్యులు, పోలీసుల తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. బసివిరెడ్డిపాలేనికి చెందిన రైతు శివనాగిరెడ్డి అనే వ్య‌క్తి తన పొలంలో మోటార్లు పోయాయని బాపట్ల రూర‌ల్ పోలీసులకు ఈ నెల 16న కంప్లైంట్ ఇచ్చాడు. గ్రామానికి చెందిన వీరాస్వామిరెడ్డి, అతని బంధువు దొడ్ల అంకిరెడ్డిపై అనుమానంతో ఎస్సై కిరణ్‌ వారిని పీఎస్ కు పిలిపించి విచారించారు. వారిద్దర్నీ గ‌త‌ తొమ్మిది రోజులుగా ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకూ స్టేషన్‌లోనే ఉంచి విచారించి పంపిస్తున్నారు. పోలీసులు ఆదివారం మరుప్రోలువారిపాలెం వెళ్లి పెద్దమ‌నుషులు సమక్షంలో వారిని విచారించారు. ఆ సమయంలో అధికార పార్టీ మండల నాయకుడొకరు ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారు. అనుమానితులను పోలీసులు త‌మ స్టైల్లో విచారించాల‌ని, జైల్లో వేసినా విడిపించటానికి ఒక్క‌రు కూడా రారంటూ బెదిరింపులకు దిగారు. సోమవారం మరోసారి పీఎస్ కు వెళ్లాల్సి ఉండగా… ఉదయం వీరాస్వామి భార్య, కుమార్తెతో కలిసి విషం తాగాడు. కుటుంబ స‌భ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా ముగ్గురూ చనిపోయారు. దీనిపై కేసు నమోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్ల‌డించారు. తప్పుడు కేసు పెట్టి తన కుమారుడి కుటుంబాన్ని చంపేశార‌ని వీరాస్వామిరెడ్డి తండ్రి శేషిరెడ్డి కన్నీరుమున్నీరయ్యారు.

మృతుడు రాసిన సూసైడ్ లేఖలో ఏముందంటే..

‘గ్రామంలో క‌నిపించ‌కుండా పోయిన‌ మోటార్లన్నీ నేనే దొంగిలించానంటున్నారు. నేను ఎటువంటి చేయలేదు. కొంతమంది పోలీసుల ద్వారా వేధిస్తూ బలవంతంగా నన్ను దొంగ‌గా చిత్రీక‌రించేందుకు ప్రయత్నిస్తున్నారు. 17వ తేదీ నుంచి పోలీస్ స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నాం. మా కుటుంబానికి, మాతో ఉన్నవారికి న్యాయం చేయాలని వేడుకొంటున్నా’ అని వీరాస్వామిరెడ్డి ఆత్మహత్యకు ముందు లేఖ రాశాడని బంధువులు మీడియాకు అందజేశారు.