మురుగు కాలువలో ‘కలకలం’… హడలెత్తిన జనం

నదుల్లో ఉండే మొసలి నగరంలోని మురుగు కాలువల్లో ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? మహారాష్ట్రలో అదే జరిగింది. రత్నగిరి జిల్లాలోని చిప్లన్ రిసార్ట్‌లోని మురుగు కాలువలో మొసలి కనిపించింది. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. అటవీ శాఖ అధికారులు దాన్ని వెలికితీసి సురక్షిత ప్రాంతానికి తరలించారు. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వీకే సుర్వే మాట్లాడుతూ.. కొద్ది రోజుల కిందట రత్నగిరిలో భారీ వర్షాలు కురిశాయని, దీంతో వశిష్ట నదిలో వరద ఏర్పడిందన్నారు. నదిలో నీరు నగరంలోని మురుగు […]

మురుగు కాలువలో 'కలకలం'... హడలెత్తిన జనం
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2019 | 5:17 PM

నదుల్లో ఉండే మొసలి నగరంలోని మురుగు కాలువల్లో ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? మహారాష్ట్రలో అదే జరిగింది. రత్నగిరి జిల్లాలోని చిప్లన్ రిసార్ట్‌లోని మురుగు కాలువలో మొసలి కనిపించింది. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. అటవీ శాఖ అధికారులు దాన్ని వెలికితీసి సురక్షిత ప్రాంతానికి తరలించారు. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వీకే సుర్వే మాట్లాడుతూ.. కొద్ది రోజుల కిందట రత్నగిరిలో భారీ వర్షాలు కురిశాయని, దీంతో వశిష్ట నదిలో వరద ఏర్పడిందన్నారు. నదిలో నీరు నగరంలోని మురుగు కాలువలను ముంచెత్తడం వల్ల మొసలి కూడా కొట్టుకొచ్చి ఉంటుందన్నారు. మురుగు కాలువ నుంచి వింత శబ్ధాలు రావడంతో స్థానికులు దగ్గరకు వెళ్లి చూశారని, మొసలిని చూసి తమకు సమాచారం ఇచ్చారన్నారు.