హెచ్ 1బీ వీసా రద్దు, ట్రంప్ ప్రభుత్వానికి కోర్టులో ఊరట
హెచ్ 1 బీ వీసాల జారీని తాత్కాలికంగా రద్దు చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వాషింగ్టన్ లోని కోర్టు సమర్థించింది. దీంతో ప్రాథమికంగా ట్రంప్ సర్కార్ కి కోర్టులో ఊరట లభించింది. కరోనా వైరస్ నేపథ్యంలో..
హెచ్ 1 బీ వీసాల జారీని తాత్కాలికంగా రద్దు చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వాషింగ్టన్ లోని కోర్టు సమర్థించింది. దీంతో ప్రాథమికంగా ట్రంప్ సర్కార్ కి కోర్టులో ఊరట లభించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ వీసాలను నిలిపివేస్తున్నామని, అమెరికన్లకే ఉద్యోగాలు అన్నదే తమ నినాదమంటూ ట్రంప్ గత జూన్ 22 న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ పాలసీ దేశానికి తీవ్ర హానికరమని బడా టెక్ కంపెనీలు దీన్ని సవాలు చేస్తూ కోర్టుకెక్కాయి. అలాగే అమెరికాలో వర్క్ వీసాలపై ఉద్యోగాలు చేస్తూ తిరిగి ఇండియాకు వఛ్చిన 169 మంది భారతీయులు కూడా ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన వాషింగ్టన్ లోని డిస్ట్రిక్ట్ జడ్జి అమిత్ మెహతా..వీసా ఆంక్షల విధింపుపై ప్రభుత్వ నిషేధాన్ని నిలిపివేయజాలమని రూలింగ్ ఇఛ్చారు. ఆయన ఇలా రూలింగ్ ఇవ్వడం ఇది రెండో సారి. గత నెలలో కూడా ఆయన ఇదే విధమైన ఉత్తర్వులు ఇచ్చారు. ట్రంప్ ప్రభుత్వ డిక్రీని సస్పెండ్ చేయాలన్న అభ్యర్థన నిలవజాలదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తాము సుప్రీంకోర్టులో ఈ రూలింగ్ పై అప్పీలు దాఖలు చేస్తామని భారతీయ వర్కర్లు తెలిపారు.