Breaking News
  • అమరావతి, వాతావరణ సూచనల: రాగల 24 గంటలలో మధ్య అరేబియా సముద్రంలలో కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. రాగల 2 రోజులలో మొత్తం దేశం నుండి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. నైఋతి బంగాళాఖాతం ప్రాంతంలో 3.1 km ఎత్తున ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. తూర్పు మధ్య బంగాళాఖాతం , ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాలలో అక్టోబర్ 29 తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం . ఉత్తర ,దక్షిణ కోస్తాంధ్ర , రాయలసీమ లో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం . సంచాలకులు, అమరావతి వాతావరణ కేంద్రము
  • విజయవాడ: జిల్లా జైలు ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు. పెట్రోల్‌ బంక్‌ను ప్రారంభించిన ఏపీ జైళ్ల శాఖ డీజీ అహసన్‌ రేజా. ఇప్పటికే ఏపీలో 8 పెట్రోల్‌ బంక్‌లు నిర్వహిస్తున్న జైళ్ల శాఖ. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలతో పెట్రోల్‌ బంక్‌ నిర్వహణ.
  • నేపాల్ గ్యాంగ్ అరెస్ట్. వారంరోజుల క్రితం నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ కు చెందిన ముఠాను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు. ఈ నెల 20 న ఇంట్లో ఉన్న వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి చోరీకి పాల్పడిన నేపాల్ కి చెందిన పనిమనుషులు. 10 లక్షల నగదు తో పాటు 20 తులాల బంగారం చోరీ చేసి పారిపోయిన పనిమానుషులు.
  • దేశ రాజధానిలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం. ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 405గా నమోదు. మరికొన్ని ప్రాంతాల్లోనూ తీవ్ర వాయు కాలుష్యం. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం తీవ్రత. పంట వ్యర్ధాల కాల్చివేత, వాహనాలు, పరిశ్రమల ద్వారా వెలువడుతున్న కాలుష్య ఉద్గారాలు.
  • కర్నూలు: నిర్మాణ స్యం గా ఉన్న దేవరగట్టు. ప్రతి ఏటా ఒకరోజు ముందే వ్యాపార అంగళ్ళు పెద్ద ఎత్తున వెలిసే వి... ఈ సారి ఇంత వరకు వాటి ఆచూకీ లేదు. దేవరగట్టు మొత్తం సీసీ కెమెరా ల భయం.. మొత్తం యాభై సిసి కెమెరాలు 4 డ్రోన్ కెమెరాలు ఏర్పాటు. ఎప్పుడూ లేని విధంగా ఎస్పీ తో సహా ఏడుగురు డిఎస్పి లు, 28 మంది సీఐలు 73 మంది ఎస్ఐలు మొత్తం వెయ్యి మందికి పైగా పోలీసుల బందోబస్తు. .దేవరగట్టులో ఈరోజు అర్ధరాత్రి జరగాల్సిన కర్రల సమరాన్ని రద్దు చేసిన పోలీసులు. లక్షల మంది జనాభా గుమ్మి కూడే ప్రాంతం కాబట్టి కరోనా వైరస్ విజృంభిస్తుంది అనేదానిపై కర్రల సమరాన్ని రద్దు చేసినట్లు ప్రకటించిన పోలీసులు. ఆచారాన్ని కొనసాగిస్తామని కర్రల సమరం జరుగుతుందని స్పష్టం చేస్తున్న నిర్వాహకులు భక్తులు. దేవరగట్టు ప్రాంతం అంతా 144 సెక్షన్ విధింపు చేతిలో కర్ర కనిపిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్న పోలీసులు. ఆలూరు అలహరి వి హోళగుంద తదితర ప్రాంతాలలో పూర్తిగా లాక్ డౌన్ విధింపు. ప్రైవేటు ప్రభుత్వ వాహనాలను కూడా నిలిపి చేస్తున్న పోలీసులు చిన్న చిన్న దుకాణాలు కూడా మూసివేత. ఆలూరు నియోజకవర్గం మొత్తం మద్యం దుకాణాలు బంద్. అంతేకాకుండా డా.దార్ల సరిహద్దుల్లో ఉన్న మద్యం షాపులను కూడా బంద్ చేయించిన పోలీసులు. బళ్లారి నుంచి ఆలూరు కి వచ్చే కె ఎస్ ఆర్ టి సి బస్సు లను సైతం నిలుపుదల చేయించిన కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ ఎస్పీ పకీరప్ప. దేవరగట్టు కర్రల సమరం పై కర్ణాటక ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేందుకు భారీ ఎత్తున చెక్ పోస్టులు ఏర్పాటు. వాహనాలు తిరగకుండా నిలిపివేసిన పోలీసులు.

ఆస్పత్రియే కళ్యాణ వేదికగా ఒకటైన ప్రేమజంట

పెద్దలను ఎదిరించిన జంట ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అదే పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. ఇందుకు ఓ ప్రభుత్వ ఆస్పత్రి వేదిక అయ్యింది.

a couple was married off at the jagtial government hospital by their villagers, ఆస్పత్రియే కళ్యాణ వేదికగా ఒకటైన ప్రేమజంట

పెద్దలను ఎదిరించిన జంట ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అదే పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. ఇందుకు ఓ ప్రభుత్వ ఆస్పత్రి వేదిక అయ్యింది. ఈ కళ్యాణ వైభోగం ఘటన జిగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రేమజంట వారి గ్రామ పెద్దల సాక్షిగా జిగిత్యాల జిల్లా ప్ర‌భుత్వ‌ ఆస్పత్రిలో ఒకటయ్యారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఓ యువతి, అదే గ్రామానికి చెందిన యువకుణ్ని ప్రేమించింది. ఇందుకు కుటుంబసభ్యులను ఒప్పేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఇక, ఆ యువ‌కుడితో త‌న పెళ్లికాదేమోనన్న భయంతో కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య యత్నం చేసింది. దీంతో స్థానికులు ఆ యువ‌తిని చికిత్స కోసం వెంట‌నే జగిత్యాల ప్రభుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుప‌డింది. ఆమె ప్రేమ‌ను అర్దం చేసుకున్న గ్రామ‌పెద్ద‌లు కుటుంబసభ్యులను ఒప్పించారు. ఆసుప‌త్రిలోనే ఆ యువ‌కుడితో యువతికి పెళ్లి తంతు జరిపించారు. ఆస్పత్రి పేషెంట్లు,సిబ్బందితోపాటు గ్రామపెద్దల సమక్షంతో ఆ జంట ఒకటయ్యారు.

Related Tags