Breaking News
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్ర నోడల్‌ ఆఫీసర్‌ రాంబాబు టీవీ9 గుడ్‌మార్నింగ్ ఇండియాలో చెప్పినట్టుగానే పాజిటివ్‌ కేసులు బాగా పెరుగుతున్నాయి.
  • ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో కోత పెట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం కరెక్ట్‌ కాదంటున్నారు తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు. అధికారం ఉందని ఇష్ట ప్రకారం చేస్తామనడం సబబు కాదన్నారు.
  • కరోనా భూతాన్ని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది.. . ఇవాళ భేటి అయిన కేంద్ర కేబినెట్‌ ఇందుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా మహమ్మారిపై యుద్ధం చేయడానికి నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో పార్లమెంట్‌ సభ్యుల వేతనాల్లో 30 శాతం కోత విధించారు.. ఏడాది పాటు కోత ఉంటుంది.
  • కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కొన్నిచోట్ల ప్రభుత్వ ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తిరునాళ్లను తలపిస్తోంది.
  • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో అకాలవర్షం భయపెడుతోంది. కర్నూలు, మహబూబ్‌నగర్‌ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతాల్లో జోరుగా వానపడింది. ఇటు వికారాబాద్‌ జిల్లా పర్గితో పాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోనూ వర్షం కురిసింది. వేసవి కాలంలో పడుతున్న ఈ అకాలవర్షంతో జనం బెంబేలెత్తారు.
  • కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లాలో కరోనా ల్యాబ్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. టెలీ మెడిసిన్‌ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ సడలింపు కేంద్రమే నిర్ణయించాలంటున్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.

విజయనగరం : 4 నెలలుగా ఆ ఇంట్లోనే శవం..ఏంటా మిస్టరీ..!

A Complete Human Skeleton Was Found In Vizianagaram District, విజయనగరం : 4 నెలలుగా ఆ ఇంట్లోనే శవం..ఏంటా మిస్టరీ..!

విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పార్వతీపురం బెలగాం వద్ద జన సంచారం ఉన్న ప్రాంతంలో  ఓ గృహం ఖాళీగా ఉంటుంది. ఆ ఇంటి ఆవరణను ఓ వ్యక్తి సిమెంట్ గోడౌన్‌గా వినియోగిస్తున్నాడు. కాగా ఈ శనివారం ఆ గోడౌన్‌ను రంగులు వేసేందుకు..ఓ వ్యక్తి లోపలికి నీళ్లు తేవడానికి వెళ్లాడు. అంతే అక్కడ సీన్ చూసి ఉరుకులు, పరుగులతో రోడ్డుపైకి కేకలు వేశాడు. లోపలికి వెళ్లిన అతడికి చీకట్లో ఏదో వస్తువు కాళ్లకు తగిలినట్టు అనిపించింది. ఏంటా అని పరీక్షించి చూడగా అస్థిపంజరం. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

స్థానిక సబ్-ఇన్‌స్పెక్టర్ జయంతి ఘటనా స్థలిని పరిశీలించారు. నాలుగు నెలలకు ముందు..హత్యో, ఆత్మహత్యో జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్లూస్ టీమ్ వచ్చి పూర్తి ఆధారాలను సేకరించింది. అయితే చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మిస్సింగ్ కేసులు ఏవీ నమోదు కాకపోవడంతో పోలీసులుకు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. అసలు ఆ అస్థిపంజరం ఎవరిది..? ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా..? లేక వ్యక్తిని చంపి పడేసి వెళ్లిపోయారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Tags