బీజేపీ నేత బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌లపై కేసు నమోదు.. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సుమోటగా కేసు ఫైల్ చేసిన పోలీసులు

జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ నగరంలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రచారాలు, రోడ్డు షోలతో ప్రధాన రాజకీయ పార్టీలన్నిబిజీ అయిపోయాయి. ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.

బీజేపీ నేత బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌లపై కేసు నమోదు.. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సుమోటగా కేసు ఫైల్ చేసిన పోలీసులు
Follow us

|

Updated on: Nov 28, 2020 | 11:40 AM

జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ నగరంలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రచారాలు, రోడ్డు షోలతో ప్రధాన రాజకీయ పార్టీలన్నిబిజీ అయిపోయాయి. ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఎవరి మేనిఫేస్టో వారిది, ఎవరి హామీలు వారివి. దీంతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మాటల తూటాలు విసురుకుంటున్నారు. ఆరోపణలు అనేవి బాగానే ఉంటాయి కానీ మితిమీరితే ఈ విధంగానే జరుగుతోంది.

తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకరిపై ఒకరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకున్నందుకు గాను పోలీసులు సుమోటాగా స్వీకరించి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. బీజేపీ నేత బండి సంజయ్ ఎర్రగడ్డ డివిజన్‌‌లో ప్రచారం చేస్తున్నప్పుడు ఎన్టీఆర్, పీవీ నరసింహారావు విగ్రహాలు కూల్చాలంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇస్తూ ‘ఒవైసీ నీకు దమ్ముంటే ఆ మహనీయులు సమాధులు ముట్టుకో చూద్దాం.. అదే జరిగితే మా కార్యకర్తలు క్షణాల్లో దారుసలాంని నేల మట్టం చేస్తారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిని సుమోటాగా తీసుకున్న ఎస్సార్‌ నగర్ పోలీసులు ఐపీసీ 505 కింద కేసు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న ఇరు పార్టీలు ఒకిరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఇటీవల పాతబస్తీలో సర్జికల్ స్టైక్ చేస్తామన్న బీజేపీ నేతలపై చాలామంది మండిపడ్డారు. ఎవరి హద్దుల్లో వాళ్లు ఉంటే మంచిదని ఓ వైపు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నా రాజకీయ పార్టీల నేతలు మాత్రం వినడంలేదు. ఇటీవల టీఆర్ఎస్ ఫ్లెక్సీలు చించేసిన కేసులో నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!

చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం

మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి

ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..

ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..

ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు

సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో

పొదుపు ఖాతాకు సంబంధించి 19 ఛార్జీలను సవరించిన ఐసీఐసీఐ బ్యాంకు

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!