అసోంలో బర్మా పైతాన్.. వీడియో చూస్తే షాక్ తినాల్సిందే..!

పైతాన్‌.. తెలుగులో కొండ చిలువ అంటాం. ఈ కొండ చిలువలకు కాటేయడానకి కోరలు ఉండవు కానీ.. ఏకంగా ప్రాణులను అమాంతం మింగేస్తాయి. మేకల్ని, దూడల్ని, దుప్పులను ఇలా కనిపంచే ప్రతి పశువులను ఇవి మింగేస్తాయి. తొలుత..

అసోంలో బర్మా పైతాన్.. వీడియో చూస్తే షాక్ తినాల్సిందే..!
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2020 | 7:12 PM

పైతాన్‌.. తెలుగులో కొండ చిలువ అంటాం. ఈ కొండ చిలువలకు కాటేయడానకి కోరలు ఉండవు కానీ.. ఏకంగా ప్రాణులను అమాంతం మింగేస్తాయి. మేకల్ని, దూడల్ని, దుప్పులను ఇలా కనిపంచే ప్రతి పశువులను ఇవి మింగేస్తాయి. తొలుత ఆ జీవుల్ని మొత్తం చుట్టేసి.. ఊపిరి ఆడకుండా చుట్టుకుని చంపేస్తాయి. ఆ తర్వాత వాటిని మింగేస్తాయి. ఇలాంటి కొండ చిలువల్లో బర్మా కొండచిలువలు కాస్త ఎక్కువ ప్రమాదకరం. అయితే ఇలాంటి బర్మా కొండచిలువ ఒకటి అసోం రాష్ట్రంలో ప్రత్యక్షమైంది. రాష్ట్రంలోని నాగోన్‌ జిల్లాలోని చపనాల ప్రాంతంలో జనావాసాల మధ్య బర్మీస్‌ కొండచిలువ కన్పించింది. దీంతో స్థానిక ప్రజలు వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలిపారు. దీంతో వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని ఆ కొండచిలువను పట్టుకున్నారు. ఆ తర్వాత దానిని స్థానిక అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీని పొడవు దాదాపు పదిహేను అడుగులు ఉందని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌ అధికారులు తెలిపారు.