Breaking News
  • కరోనా నుంచి బయటపడిన చైనా, ఇప్పుడు యూరప్‌ దేశాలకు కిట్లను, మాస్క్‌లను పంపిస్తోంది. అయితే వాటిలో నాణ్యత లేదని కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. పరికరాలను తిప్పి పంపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని, చైనా తన ప్రభావాన్ని విస్తరించుకోవడానికి వాడుకుంటోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భూతం విస్తరిస్తోంది. ఏపీలో ఉన్న 13 జిల్లాలలో 11 జిల్లాలను కరోనా కమ్మేసింది. నిజాముద్దీన్‌ జమాత్‌ లింకులతో చిన్న పట్టణాలు, పల్లెలకు కూడా వ్యాపించింది కరోనా.. కొత్త కేసులన్నింటికీ ఢిల్లీ లింకులుండటం ఆందోళన కలిగిస్తోంది.
  • కరోనాపై యుద్ధం చేస్తున్న భారత్‌కు ప్రపంచబ్యాంకు భారీ సాయాన్ని అందించింది. భారత్‌తో పాటు కరోనాను ఎదుర్కొంటున్న పలు దేశాలకు ప్రపంచబ్యాంకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. కరోనాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న భారత్‌కు ఒక బిలియన్‌ డాలర్ల భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది ప్రపంచబ్యాంక్‌..
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇది గందరగోళానికి దారి తీస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లారు ఆశావర్కర్లు. సర్వే కోసమని వెళ్లిన ఆశా వర్కర్లను దుర్భాషలాడటమే కాకుండా వారిపై దాడికి ప్రయత్నించారు
  • అమరావతి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ.

ఫ్యాన్స్‌కు ‘ది వాల్’.. క్రికెటర్లకు అతడొక ‘ఎవరెస్టు శిఖరం’

Rahul Dravid Birthday Special, ఫ్యాన్స్‌కు ‘ది వాల్’.. క్రికెటర్లకు అతడొక ‘ఎవరెస్టు శిఖరం’

భారత క్రికెట్ జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతీసారి మిడిల్ ఆర్డర్‌లో కీలక బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తూ వచ్చాడు రాహుల్ ద్రావిడ్. 2012లో అంతర్జాతీయ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన అతడు ప్రస్తుతం బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీకి డైరెక్టర్‌గా వ్యవహరించడమే కాకుండా భారత్ జట్టుకు సలహాదారుడిగా, మరో పక్క కామెంటేటర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. రేపు తన 47వ పుట్టినరోజు జరుపుకుంటున్న రాహుల్ ద్రావిడ్.. కెరీర్‌లో ఎన్నో అవార్డులు, రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. 2000వ సంవత్సరంలో విజ్డెన్ క్రికెటర్‌గా.. 2004లో ఐసీసీ క్రికెటర్ అఫ్ ది ఇయర్‌ ఎంపికైన అతడు టెస్టు క్రికెట్‌లోనే కాకుండా వన్డేల్లో కూడా 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కాగా, మొదటి రెండు స్థానాల్లోనూ సచిన్ టెండూల్కర్, బ్రెయిన్ లారాలు ఉన్నారు.

భారత ప్రభుత్వం ద్రావిడ్‌ను ‘పద్మశ్రీ’, ‘పద్మ భూషణ్’ అవార్డులతో సత్కరిస్తే.. ఐసీసీ.. హాల్ అఫ్ ఫేమ్‌లో చోటు కల్పించి ఈయన్ని  గౌరవించింది. 1996లో భారత్ తరపున అరంగేట్రం చేసిన ద్రావిడ్.. తన బ్యాటింగ్ టెక్నిక్‌పై అప్పట్లో అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంటర్నేషనల్ ప్రమాణాలకు సరిపోయేలా లేదని.. జిడ్డు బ్యాటింగ్ చేస్తాడని హేళన చేశారు. కానీ అతడు ఎక్కడా కూడా నిరాశ చెందలేదు. ఎవరైతే చెత్త బ్యాటింగ్ అన్నారో.. వారి చేతే ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాకుండా తనదైన శైలి ఆటతీరుతోనే భారత్‌కు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు కూడా అందించాడు. ఇకపోతే ఫ్యాన్స్ ద్రావిడ్‌ను ముద్దుగా ‘ది వాల్’ అని పిలుచుకుంటారు.

2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు లక్ష్మణ్‌తో కలిసి ద్రావిడ్ నెలకొల్పిన 376 పరుగుల వరల్డ్ రికార్డు పార్టనర్‌షిప్ ఇప్పటికీ క్రికెట్ అభిమానులు మర్చిపోలేరు. అలాంటి ఎంతో ప్రతిభ కలిగిన ఈ క్రికెటర్‌కు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదన్న క్రికెట్ దిగ్గజాల వాదన. కాగా, ద్రావిడ్ తన 16 ఏళ్ల కెరీర్‌లో భారత్ తరపున 509 అంతర్జాతీయ మ్యాచులు ఆడి 24,208 పరుగులు చేశాడు. అందులో 48 సెంచరీలు, 146 అర్ధ సెంచరీలున్నాయి.

Related Tags