Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 98 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. 2 లక్షలకు చేరువ లో కరోనా కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 198706. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 97581. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5598. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజేంద్రనగర్ గ్రే హౌండ్స్ ప్రాంతంలో మళ్లీ చిరుత తిరుగుతూ సిసి కెమెరాకు చిక్కిన ఆనవాళ్లు. గ్రే హౌండ్స్ కాంపౌండ్ లోపల ఉన్నట్టు గుర్తింపు. 700ఎకరాల్లో పోలీస్ గ్రే హౌండ్స్ . గ్రే హౌండ్స్ ఉన్నతాధికారుల నుండి అనుమతి వచ్చిన తర్వాతే బొన్లు ఏర్పాటు చేస్తామని చెబుతున్న అటవీశాఖ అధికారులు. గ్రే హౌండ్స్ చుట్టూ జూ సిబ్బంది, షూటర్స్, ట్రాప్ కెమెరా లతో అప్రమత్తం.
  • రెండు రాష్ట్రా ప్రభుత్వాలకు ఈనెల 4న జరిగే కృష్ణా నది యజమాన్య బోర్డు మీటింగ్ ఏజెండాలను పంపిన కృష్ణా నీటీ యాజమాన్య బోర్డ్. ఏజెండాలో ప్రధానంగా 5 అంశాల ప్రస్తావన. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు చేపడుతున్న ప్రాజెక్టు లు , అభ్యంతరాలు , ప్రాజెక్టుల డీపీఆర్ లు.
  • టిటిడి : తిరుమలలో శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. టిటిడి ఉద్యోగాలు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని సూచన. టీటీడీ ఈవో లేఖకు స్పందించిన ఏపీ ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జే.ఎస్.వి ప్రసాద్.
  • తూ. గో.జిల్లా: కోనసీమలో కరోన కలకలం. కోనసీమను గజ గజ లాడిస్తున్న ..ముంబై నుంచి వచ్చిన వలస కూలీలు . ఈరోజు ఒక్కరోజులో 28 కరోన పోసిటివ్ కేసులు నమోదు.
  • టీవీ9 తో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శిశి కళ . ఉస్మానియా మెడికల్ కాలేజీ లో 12 మందికి కోవిడ్ పాజిటివ్. భయం గుప్పెట్లో ఉస్మానియా పీజీలు. ఇప్పటికే రిడింగ్ రూమ్ ను మోసివేసిన కాలేజ్ యాజమాన్యం. ప్రతి ఒక్క పీజీ ని ppe కిట్స్ వెస్కొమని సూచిస్తున్న ప్రిన్సిపల్ శశికళ. జూనియర్ డాక్టర్స్ కు పాజిటివ్ రావటం తో హాస్టల్ ను శానిటేషన్ చేసిన ghmc.

కోడెల శివప్రసాదరావు మృతి ఓ మిస్టరీ: ఎన్నో మలుపులు..?

A Brief Analysis on Kodela's Death Mystery, కోడెల శివప్రసాదరావు మృతి ఓ మిస్టరీ: ఎన్నో మలుపులు..?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి నిజంగా మిస్టరీగా మారింది. నిన్న అనూహ్యరీతిలో ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో.. ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఆయన మరణవార్త తెలియగానే.. కోడెల అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఇంటికి చేరుకున్నారు. అసలు నిజంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారా..! మేము నమ్మలేకపోతున్నామంటూ.. బోరున విలపిస్తున్నారు. కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యనే చేసుకుని మృతి చెందారని బసవతారకం హాస్పిటల్ డాక్టర్లు ప్రాథమికంగా.. రిపోర్టు ఇచ్చినా.. పోస్టుమార్టం రిపోర్టు వస్తే కానీ.. అసలు విషయం తెలియదు.

కాగా.. కోడెల డెత్ మిస్టరీ కాస్తా.. ఇప్పుడు రాజకీయ రంగులు పులుముకుంది. ‘మీ టార్చర్, వేధింపుల కారణంగానే.. కోడెల మృతి చెందారని టీడీపీ వర్గం.. వైసీపీని విమర్శిస్తుంటే.. కాదు.. మీ నిర్లక్ష్యంతోనే ఆయన మరణించాడని.. వైసీపీ.. టీడీపీపై ప్రత్యారోపణలు చేస్తోంది. అయితే.. కోడెల గన్‌మెన్ ఆదామ్.. మాత్రం.. ఆయన ఉరివేసుకుని చనిపోయారని చెబుతున్నారు. కోడెలను స్వయంగా.. గన్‌మెన్, హెంగార్డులే ఆస్పత్రికి తీసుకువచ్చారు.

ఉదయం 9.30 సయంలో.. కోడెల సార్.. ఇంటిలోని ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్లడాన్ని నేను చూశానని.. ఆ తరువాత విజయలక్ష్మీ మేడమ్.. 11 గంటలకు పైకి వెళ్లి ఎంత కొట్టినా.. సార్ తలుపులు తీయకపోయేసరికి.. గట్టిగా అరిచిందని అన్నారు. దీంతో.. మేము వెళ్లి.. పిలిచినా.. తలుపులు తీయకపోవడంతో.. కిటికీ గేట్ నుంచి లోపలికి వెళ్లినట్టు తెలిపాడు. లోపలికి వెళ్లగానే.. నైలాన్‌ తాడుకు సార్ వేలాడుతూ.. కనిపించారని.. అది చూసి మేమందరం షాక్‌కి గురై.. వెంటనే ఆస్పత్రికి తరలించామని.. గన్‌మెన్ ఆదామ్ చెప్పాడు. అలాగే.. కోడెల కూతురు విజయలక్ష్మి కూడా.. వైసీపీ ప్రభుత్వ వేధింపులే కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

ఈ రకంగా చూస్తే.. వైసీపీ వేధింపులతోనే ఆయన మరణించారా..? నిజంగానే.. ఆత్మహత్య చేసుకున్నారా..? కోడెలపై 32 కేసులు, ఆయన కూతురు, కొడుకులపై కేసులు ఇలా.. అన్నీ ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయా..! ఒకవేళ అవి రుజువైతే.. ఆయన జైలుకెళ్లాల్సి వస్తుంది. ఎక్కడ తన పరువు పోతుందని.. భయంతోనే.. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడనే వాదనలు కూడా వినవస్తున్నాయి.

కాగా.. మరో ఆసక్తికర విషయమేమిటంటే.. కోడెలపై ఉన్న కేసుల కారణంగా.. రోజూ ఆయనకి.. డీజీపీ ఫోన్‌ చేసి మాట్లాడేవారని.. దీంతో.. ఆయన ఇంకా భయాందోళన చెందేవారని.. ఆయన సన్నిహితులు తెలిపారు.

అటు.. ఈ కేసుల గురించి చంద్రబాబు కూడా.. ఆయనతో సఖ్యతగా లేకపోవడం.. టీడీపీలోని మరో వర్గం ఆయనకు యాంటీగా నిలవడం కూడా.. ఆయన్ను ఒకింత ఆందోళకు గురిచేసినట్టు తెలుస్తోంది. కానీ.. స్పీకర్‌గా వ్యవహరించిన వ్యక్తి.. పల్నాడు పులి అని కూడా పేరుతెచ్చుకున్న కోడెల ఇలా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Related Tags