ఒక్కరోజులో వైరల్ అయ్యాడు..వెంటనే చనిపోయాడు!

తన కూతురులా వేషం వేసుకొని జైలు నుంచి పారిపోదామని చూసి ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అయిన బ్రెజిల్‌ డ్రగ్‌ డాన్‌ క్లావినో డా సిల్వా మంగళవారం జైలు గదిలో విగతజీవిలా కనిపించాడు. అతడు బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని చనిపోయాడని జైలు అధికారులు వెల్లడించారు.రియో జైలులో శిక్ష అనుభవిస్తున్న సిల్వాను కలిసేందుకు అతడి కుమార్తె జైలుకెళ్లింది. బంధువులు, ఖైదీలు కలుసుకునే గదిలోకి వెళ్లి తండ్రితో మాట్లాడింది. ఆ తర్వాత ఆమెకు బదులు సిల్వా బయటకు వచ్చాడు. అచ్చం కూతురి ముఖాన్ని […]

ఒక్కరోజులో వైరల్ అయ్యాడు..వెంటనే చనిపోయాడు!
Follow us

|

Updated on: Aug 07, 2019 | 9:38 PM

తన కూతురులా వేషం వేసుకొని జైలు నుంచి పారిపోదామని చూసి ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అయిన బ్రెజిల్‌ డ్రగ్‌ డాన్‌ క్లావినో డా సిల్వా మంగళవారం జైలు గదిలో విగతజీవిలా కనిపించాడు. అతడు బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని చనిపోయాడని జైలు అధికారులు వెల్లడించారు.రియో జైలులో శిక్ష అనుభవిస్తున్న సిల్వాను కలిసేందుకు అతడి కుమార్తె జైలుకెళ్లింది. బంధువులు, ఖైదీలు కలుసుకునే గదిలోకి వెళ్లి తండ్రితో మాట్లాడింది. ఆ తర్వాత ఆమెకు బదులు సిల్వా బయటకు వచ్చాడు. అచ్చం కూతురి ముఖాన్ని తలపించే సిలికాన్ మాస్క్, జుట్టుతోపాటు ఆమె దుస్తులను ధరించి.. జైలు సిబ్బంది కళ్లు గప్పి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే, సిబ్బందికి అనుమానం కలిగి తనిఖీ చేయడంతో దొరికిపోయాడు. అతడు మాస్క్ తొలగిస్తున్న వీడియో సోషల్ మీడియాల్ వైరల్ అయ్యింది.

అతడిపై నిఘా పెంచిన జైలు అధికారులు హై సెక్యూరిటీ యూనిట్‌కు తరలించారు. 73 సంవత్సరాల కారాగారం విధించడం, ఇప్పటికే జైలు నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం అవడంతోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.