పాన్ఇండియా స్థాయిలో కరణం మల్లేశ్వరి బయోపిక్..

గత కొన్నేళ్లుగా అన్ని ఇండస్ట్రీల‌లో బ‌యోపిక్ ల హ‌వా కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. తాజాగా టాలీవుడ్​లో మ‌రో క్రీడాకారిణి బయోపిక్​కు రంగం సిద్ధమైంది. ఒలింపిక్స్​​ మహిళా విభాగంలో ఇండియాకు ఫ‌స్ట్ మెడ‌ల్ అందించిన వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి జీవిత క‌థ‌ను త్వ‌ర‌లో వెండితెర‌పైకి తీసుకురాబోతున్నారు. ఈ రోజు ఆమె బ‌ర్త్ డే సందర్భంగా చిత్ర పోస్టర్​ను రిలీజ్ చేసి, అధికారిక ప్రకటన చేశారు. ఈ సినిమాను సంజనా రెడ్డి తెర‌కెక్కించ‌బోతున్నారు. ఎమ్​వీవీ సత్యనారాయణ, కోన వెంకట్ […]

పాన్ఇండియా స్థాయిలో కరణం మల్లేశ్వరి బయోపిక్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 01, 2020 | 2:43 PM

గత కొన్నేళ్లుగా అన్ని ఇండస్ట్రీల‌లో బ‌యోపిక్ ల హ‌వా కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. తాజాగా టాలీవుడ్​లో మ‌రో క్రీడాకారిణి బయోపిక్​కు రంగం సిద్ధమైంది. ఒలింపిక్స్​​ మహిళా విభాగంలో ఇండియాకు ఫ‌స్ట్ మెడ‌ల్ అందించిన వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి జీవిత క‌థ‌ను త్వ‌ర‌లో వెండితెర‌పైకి తీసుకురాబోతున్నారు. ఈ రోజు ఆమె బ‌ర్త్ డే సందర్భంగా చిత్ర పోస్టర్​ను రిలీజ్ చేసి, అధికారిక ప్రకటన చేశారు.

ఈ సినిమాను సంజనా రెడ్డి తెర‌కెక్కించ‌బోతున్నారు. ఎమ్​వీవీ సత్యనారాయణ, కోన వెంకట్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేయ‌నున్నారు. ఇందులో మల్లేశ్వరి పాత్ర ఎవ‌రు చేయ‌బోతున్నారు?, ఇతర టెక్నిక‌ల్ టీమ్ వివరాలు తెలియాల్సి ఉంది. దీనిని పాన్​ఇండియా మూవీగా పలు భాషల్లో తెరకెక్కించనున్నారు.

ఒలింపిక్స్​లో ఇండియా​ తరఫున రెండుసార్లు బ‌రిలోకి దిగిన‌ మల్లేశ్వరి.. 1998 బ్యాంకాక్​లో జరిగిన పోటీల్లో 63 కిలోల విభాగంలో రజతం, 2000లో సిడ్నీలో జ‌రిగిన‌ పోటీల్లో కాంస్యం పతకం గెల్చుకున్నారు. 1995లో చైనా, గ్వాంగ్జూలో జరిగిన వ‌ర‌ల్డ్ వెయిట్​ లిఫ్టింగ్ టోర్నీలో 54 కిలోల విభాగంలో మూడు స్వర్ణాలు గెలుపొందారు. వెయిట్​ లిఫ్టింగ్​లో మల్లేశ్వరి చేసిన కృషికిగానూ..ఆమెను అర్జున అవార్డు, రాజీవ్ ఖేల్​రత్న, పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించింది భారత ప్రభుత్వం.

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.