కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం… 960 మంది వీసాలు రద్దు

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి ఢిల్లీలోని తబ్లీగీ జమాత్‌లో పాల్గొని..దేశంలో క‌రోనా వ్యాప్తికి కార‌ణ‌మైన‌ 960 మంది విదేశీలయుల వీసాలను రద్దు చేసింది. “హోం మంత్రిత్వ శాఖ 960 మంది విదేశీయులను బ్లాక్ లిస్ట్ చేసింది. పర్యాటక వీసాలపై వచ్చి తబ్లిఘి జమాత్ కార్యకలాపాలలో పాల్గొన్నందుకు వారి భారత వీసాలు కూడా రద్దు చేయబడ్డాయి” అని హోంమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. విదేశీయుల చట్టం 1946.. విపత్తు నిర్వహణ చట్టం 2005 […]

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం... 960 మంది వీసాలు రద్దు
Follow us

|

Updated on: Apr 03, 2020 | 8:21 AM

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి ఢిల్లీలోని తబ్లీగీ జమాత్‌లో పాల్గొని..దేశంలో క‌రోనా వ్యాప్తికి కార‌ణ‌మైన‌ 960 మంది విదేశీలయుల వీసాలను రద్దు చేసింది. “హోం మంత్రిత్వ శాఖ 960 మంది విదేశీయులను బ్లాక్ లిస్ట్ చేసింది. పర్యాటక వీసాలపై వచ్చి తబ్లిఘి జమాత్ కార్యకలాపాలలో పాల్గొన్నందుకు వారి భారత వీసాలు కూడా రద్దు చేయబడ్డాయి” అని హోంమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.

విదేశీయుల చట్టం 1946.. విపత్తు నిర్వహణ చట్టం 2005 లోని సంబంధిత సెక్షన్లు ఉల్లంఘించిన వారందరిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల డీజీపీల‌ను.. ఢిల్లీ పోలీసు కమిషనర్ను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ లో ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్న అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ సహా ప‌లు దేశాల‌కు చెందిన‌ 1,300 మంది విదేశీ తబ్లిగి జమాత్ కార్యకర్తలు దేశంలోని వివిధ ప్రాంతాలలో గుర్తించబడ్డారని, వారిలో ఎక్కువ మందిని ఉంచినట్లు అధికారులు గురువారం తెలిపారు .